ఆంధ్రప్రదేశ్‌

వంశధార ఉగ్రరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 21: పొరుగు రాష్ట్రం ఒడిశా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. మరో 24 గంటల్లో వరద భయం ఉండొచ్చని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ, నాగావళి, వంశధార నదుల పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలు, జిల్లాలోని తహశీల్దార్లందర్నీ అప్రమత్తం చేసారు. గత రెండు రోజులుగా సిక్కోల్‌కు పట్టిన ముసురుకు పట్టణాలు, గ్రామాలు మునిగిపోయే ప్రమాదం లేకపోయినప్పటికీ, నాగావళి, వంశధార వరద ప్రవాహం జిల్లాను వణికిస్తోంది. రెండు రోజులుగా ఒడిశా ఎగువ ప్రాంతంలో కాట్రగడలో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గుడారిలో 6.7 సెంటీమీటర్లు, గుణుపూర్‌లో 9.0 సెంటీమీటర్లు, మహేద్రగడలో 5.9 సెంటీమీటర్లు, కాశీనగర్‌లో 8.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. గత 48 గంటల్లో ఒడిశా ఎగువప్రాంతంలో సగటున 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతో వంశధార, నాగావళి నదుల్లో వరదనీటి ప్రవాహం ఎక్కువైంది. గొట్టాబ్యారేజీలో అన్నీ గేట్లు ఎత్తివేసి నీరు కిందికి విడిచిపెడుతూ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. తోటపల్లి జలాశయంలోనూ గేట్లు పూర్తిగా ఎత్తివేసారు.