ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్యమంటే అర్థం తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 9: చంద్రబాబునాయుడు ప్రధాని మోదీ అంటే భయంతోనే రాష్ట్రంలో బీజేపీ నాయకులను గృహ నిర్భంధం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ప్రజాస్వామ్యమంటే చంద్రబాబునాయుడుకు అర్ధం తెలియదన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. బీజేపీయేతర కూటమి పేరుతో చంద్రబాబు దేశంలోని దొంగలందరినీ కూడగడుతున్నారని ఎద్దేవాచేశారు. మొన్న ఢిల్లీ, నిన్న బెంగళూరు, నేడు చెన్నై వెళ్లి రకరకాల స్కాముల్లో ఉన్న వారిని కలుస్తున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యమంటే అర్ధం తెలియని ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడేనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధిపై చర్చకు రావాలని బీజేపీ నాయకులు పిలుపునిస్తే అక్కడ 144 సెక్షన్ పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. గుంటూరు నుండి తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు జీవీఎల్ నర్శింహరావు, గోకరాజు గంగరాజు, తాను బయలుదేరి వస్తుంటే తాడేపల్లిగూడెం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అటకాయించి, బీజేపీ నేతలను తీసుకెళ్ళి గృహ నిర్భంధం చేయడం ప్రజాస్వామ్యమా అని సోము ప్రశ్నించారు. తాను ఏదో విధంగా అక్కడ నుంచి తప్పించుకుని వచ్చానన్నారు. మళ్ళీ విజయవాడ దాటిన తర్వాత హనుమాన్ జంక్షన్ వద్ద పదుల సంఖ్యలో డిఎస్పీలు, సీఐలు, వందలాది మంది పోలీసులు తనిఖీలు చేయడం దారుణమన్నారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబునాయుడు ఒక భయానక వాతావరణంలో బతుకుతున్నట్టుగా వుందని సోము వీర్రాజు విమర్శించారు.
దేవెగౌడ తదితర ఈ గుంపు అంతా కలసింది కేవలం కొడుకులకు పట్ట్భాషేకాల కోసమేనని సోము ఎద్దేవాచేశారు. చంద్రబాబునాయుడు కొడుకును తప్ప టీడీపీలో వేరెవ్వరినీ ఎదగనీయరన్నారు. కుటుంబ స్వామ్యాన్ని రక్షించుకోవడానికి వీరంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో పచ్చగడ్డి, ఎండుగడ్డి తదితర స్కాములకు పాల్పడిన దోపిడీ దొంగలంతా కలిసినా మోదీని ఏమీ చేయలేరన్నారు. దేవెగౌడ, చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఏభై ఏళ్ళ పాటు మధ్యలో ఒకరిద్ధరు తప్ప వంశ పాలన చేసిన కాంగ్రెస్‌కు నాలుగేళ్ళకే బీజేపీని చూసి ఇంత భయమెందుకో అర్ధం కావడం లేదన్నారు. బాబును దారిలో పెట్టేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. పోలీసులు, యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా మారిపోయారని, ప్రజా సమస్యల గురించి ప్రజల పక్షాన పోరాటం చేస్తే బీజేపీ నాయకులపై కేసులు పెడుతున్నారన్నారు.