ఆంధ్రప్రదేశ్‌

మనకు తెలియని స్వాతంత్య్రోథ్యమ చరిత్ర ఎంతో ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 13: స్వాతంత్య్రోద్యమంలో మనకు తెలియని, బహిర్గతం కాని అంశాలు ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా దేశ విభజన జరిగిన విధానంలో కూడా కొన్ని అంశాలు వెలుగుచూడలేదని మేఘాలయ గవర్నర్, ప్రఖ్యాత చరిత్ర విశే్లషకులు తధాగత రాయ్ అన్నారు. ‘రక్షణరంగ పరిశోధనలకు కేంద్రంగా భారతదేశ విశ్వవిద్యాలయాల సామర్ధ్యం పెంపు’ అంశంపై విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. తనకు ఎంతో ఇష్టమైన చరిత్రపై విశ్వవిద్యాలయాల్లో ప్రసంగించడం సంతోషకరమైన అంశమన్నారు. స్వాతంత్య్రానికి ముందు దేశ విభజన అంశంలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. స్వాతంత్య్రానికి ముందే ముస్లిం లీగ్ భారత్ నుంచి విడిపోయేందుకు సిద్ధమైందని, స్వాతంత్య్రానికి ముందే పాకిస్తాన్ వేరుపడాలనేది జిన్నా అభిమతంగా పేర్కొన్నారు. పంజాబ్ విభజన అంశం అందరికీ చిరపరిచితమేనని, అయితే తూర్పు ప్రాంతంలో జరిగిన బెంగాల్ విభజన అంశాలు వెలుగులోకి రాలేదన్నారు. స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరు సందర్భంగా 1944లో మహాత్మా గాంధీ, మహ్మదాలీ జిన్లా మధ్య జరిగిన చర్చలు, 1946లో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం బహిర్గతం కాలేదన్నారు. అబుల్ కలామ్ ఆజాద్ రచించిన పుస్తకంలో కొన్ని పుటల్లో ఇవి నిక్షిప్తమై ఉన్నాయని, స్వాతంత్య్రానంతరం ఎంతో కాలానికి ఇవి ముద్రణకు నోచుకున్నాయన్నారు. అయితే దేశ విభజన అలోచనను నిలువరించే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో జరగలేదన్నది తన అభిప్రాయంగా వ్యక్తం చేశారు. చరిత్రపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, రాజకీయ అంశాలను ప్రస్తావించేది లేదని కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. విశాఖతో తనకు పూర్వపరిచయం ఉందని, బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం రవాణా చేసేందుకు వీలుగా నిర్మించిన కేకే లైన్ రూపకల్పనలో రైల్వే ఇంజనీరుగా తాను ఇక్కడ పనిచేశానన్నారు. ఎన్‌ఎస్‌టీఎల్ టెక్నికల్ డైరెక్టర్ జీ రవికుమార్ మాట్లాడుతూ విద్యా సంస్థలతో పరిశోధన పరంగా పనిచేసేందుకు ఎన్‌ఎస్‌టీఎల్ సిద్ధంగా ఉందని, తగిన పరిశోధన సంబంధ ప్రతిపాదనలతో విద్యారంగ నిపుణులు ముందుకు రావాలని ఆహ్వానం పలికారు. విద్యా సంస్థలకు పరిశోధన పరంగా అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు అవసరమైన పరిశోధన సహకారాన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు అందించాలన్నారు. నేవల్ రీసెర్చ్ బోర్డులో పలు పరిశోధనలకు అవకాశం ఉందని, ఔత్సాహికులు వాటిని ఎంపిక చేసుకోవచ్చన్నారు. సీఎస్‌ఓ తూర్పునౌకాదళం ప్రధాన కార్యాలయం రియర్ అడ్మిరల్ దీపక్ కపూర్ మాట్లాడుతూ పరిశోధన పటిమను వృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఇతర దేశాలపై ఉద్దేశపూర్వక దాడులకు భారత్ దూరమని, దేశ రక్షణ అవసరాలకు అనుగుణంగానే యుద్ధానికి సిద్దం అవుతామన్నారు. మన దేశంలో స్వీయ పరిశోధనలు మరింత పెరగాల్సి ఉందన్నారు. అంతరిక్ష రంగంలో సాధిస్తున్న ప్రగతికి సమానంగా రక్షణ రంగం పరిశోధనల్లోనూ సాధించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ రక్షణశాఖ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి రక్షణ రంగ ఉపయుక్త పరిశోధనలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. వర్శిటీ వీసీ ఆచార్య జీ నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఖ్యాతి, ప్రస్తుతం సాధిస్తున్న విజయాలను విశదీకరించారు. రక్షణ రంగానికి ఉపయుక్తమైన కోర్సులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశానికి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్యా సీఎస్ అవధాని సారధ్యం వహించగా, రిజిస్ట్రార్ ఆచార్య కే నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ తధాగత రాయ్‌ను ఏయూ తరపున ఘనంగా సత్కరించారు.