ఆంధ్రప్రదేశ్‌

సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 13: పదవ తరగతి సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఆయా కేంద్రాల్లో అన్ని వసతులతో సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని విద్యా శాఖ కమిషనర్ కె సంధ్యారాణి చెప్పారు. రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన జాతీయ సదస్సుకు హాజరైన సందర్భంగా కమిషనర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో కాపీయింగ్ జరిగిన సెంటర్లలో ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిన్న పిల్లల క్లాస్ రూమ్‌లు కూడా పరీక్ష కేంద్రాలుగా ఉపయోగిస్తామన్నారు. అదే విధంగా వసతులు లేని కేంద్రాలను మార్పుచేస్తామన్నారు. క్యూ ఆర్ కోడ్స్ ఇప్పటి వరకు నాన్ లాంగ్వేజెస్‌కి పెట్టామని, తర్వాత విద్యా సంవత్సరంలో లాంగ్వేజెస్ కూడా వస్తాయన్నారు. రెండేళ్లలో పర్సనలైజ్ ఎడాప్ట్ లెర్నింగ్ రెండు వేల పాఠశాలల్లో ఏర్పాటుచేస్తామన్నారు. పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్లను ఏజెన్సీకి అప్పగించడం ద్వారా వారి సేవలను వినియోగించుకుంటామన్నారు.
భవిష్యత్తు అంతా ఈ లెర్నింగ్ పైనే
కాగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సెకండరీ విద్యలో ఈ లెర్నింగ్ ప్రభావం అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి ప్రసంగిస్తూ ఆధునిక యుగంలో విద్యావిధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, దీనిలో భాగంగానే రాబోయే కాలంలో సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరుగుతుందని, ఈ లెర్నింగ్‌తోనే భవిష్యత్ విద్యా విధానం వుండబోతుందన్నారు. సెకండరీ విద్యలో ఇప్పటికే చాలా పాఠశాలలో ఈ-లెర్నింగ్ క్లాసులు, వర్చువల్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీలో 5వేల డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నామని, వాటిలో ప్రస్తుతం 2650 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి స్థాయిలో అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వెయ్యి పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుచేశామన్నారు. మొదటి దశగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రెండవ దశలో మరికొన్ని పాఠశాలలను సాంకేతిక పరుస్తామన్నారు. అలాగే ఐసిటీ ల్యాబ్‌లను కూడా భారత ప్రభుత్వం ఆమోదించిందని, దానికి సంబంధించిన నిధులు విడుదలయితే కొన్ని పాఠశాలలను ఎంపికచేసి ఒక్కో పాఠశాలల్లో 20-40 కంప్యూటర్లు లేదా, ల్యాప్‌టాప్‌లతో ల్యాబ్‌లను అభివృద్ధిపరుస్తామన్నారు. వాటితో పాటు ఉపాధ్యాయులకు వివిధ విద్యాపరమైన శిక్షణలపై ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీ మండలంలోనూ రెండు పాఠశాలలను గుర్తించి ప్రయోగాత్మకంగా ఆనందలహరి తరగతులను శాస్త్ర, సాంకేతిక ద్వారా పాఠ్యాంశాలను అందిస్తున్నామన్నారు.
నన్నయ విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు, మాజీ వైస్-్ఛన్సలర్ జార్జి విక్టర్ తదితరులు ప్రసంగించారు. ఈసందర్భంగా సెకండరీ విద్యలో ఈ-లెర్నింగ్ ప్రభావం అనే అంశాలపై పరిశోధనా పత్రాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ జాతీయ సదస్సుకు చైర్మన్‌గా డాక్టర్ కె సుబ్బారావు, కన్వీనర్‌గా డాక్టర్ ఎన్ సుజాత వ్యవహరించారు.