ఆంధ్రప్రదేశ్‌

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోకపోయినా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట మాట్లాడటం లేదంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆక్షేపించారు. దుబాయ్‌లో టీడీపీ ఎన్నారై సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఐటీ రంగం ఎవరి హయాంలో అభవృద్ధి చెందిందో అక్కడి ప్రజలకు బాగా తెలుసు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కూడా పలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. హామీలు అమలు చేయకపోయినా కేసీఆర్ మాట్లాడటం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసిందన్నారు. ఇచ్చిన ఒక హామీని కూడా అమలు చేయలేదన్నారు. హామీల అమలు గురించి అడిగితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రత్యేక హోదా సహా 18 హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని గుర్తు చేశారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో అన్ని పార్లమెంట్ సీట్లు గెలిచి దేశ ప్రధాని ఎవరు అవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయించబోతున్నారన్నారు.హోదా సహా ఇచ్చిన అన్ని హామీలు సాధిస్తామని స్పష్టం చేశారు. ఏపీలోని అనేక గ్రామాల అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు అవుతున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌తో ప్రయాణం మొదలైందన్నారు. రాష్ట్ర విభజన చేసిన వారు అసూయ పడే విధంగా రాజధాని అమరావతి నిర్మిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా రెండంకెల వృద్ధి రేటు సాధించామన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలోని రైతులు కరవును చూసి భయపడే రోజులు పోవాలని, రైతును చూసి కరవు భయపడే రోజు రావాలని భావిస్తూ వ్యవసాయ రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేశామని, గ్రామాల్లో ఎప్పుడూ లేని విధంగా వౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశంలో తయారయ్యే 10 సెల్‌ఫోన్లలో 3 ఏపీలో తయారవుతున్నాయన్నారు. 67 ఏళ్ల వయసులో 24 ఏళ్ల కుర్రాడిలా ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ అమరావతికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చారన్నారు. ఏపీ బ్రాండ్ అంబాసిడార్లుగా ఏన్నారైలు మారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించాలని పిలుపునిచ్చారు. తెలుగువారు ఎక్కడ ఏ సమస్య ఎదుర్కొంటున్నా, పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలుగువారంతా కలిసి ఉండాలని, అభివృద్ధి చెందాలని తమ ఆకాంక్ష అన్నారు.
ఇప్పటి వరకూ ఏపీకి తిరిగి రావడానికి ఏపీఎన్‌ఆర్టీ ద్వారా 200 మందికి సహాయం అందించామన్నారు. రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు అవసరమయ్యే ఎంబసీ డాక్యుమెంటేషన్ ఖర్చులు, విమాన చార్జీలు చెల్లించామన్నారు. దుబాయ్‌లో అక్రమంగా ఉంటున్న వారు తిరిగి వారి దేశాలకు వెళ్లేందుకు అమ్నెస్టీని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. బాధితులను దేశానికి తరలించి, వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తామన్నారు. నైపుణ్యాభివృద్ధి తరువాత చట్టప్రకారం దుబాయ్ వెళ్లేందుకు ఎపీఎన్నార్టీ సహకరిస్తుందని వెల్లడించారు. కష్టాల్లో ఉన్న తెలుగువారిని ఆదుకుంటామని, రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు సహకరిస్తామన్నారు.