ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రా ద్రోహి చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుపెట్టుకొని, కాంగ్రెస్‌తో జతకట్టి ఆంధ్రా ద్రోహిగా మారారని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోధర్ ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల ఒనగూరేది ఏది లేదని చెప్పిన చంద్రబాబునాయుడు నేడు మాట మార్చి ప్రత్యేక హోదా కావాలనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేస్తున్న నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్టు ఆయన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ప్రధాని సౌభాగ్య యోజన కింద ఐదు సోలార్ ఎల్‌ఇడి బల్బులు ఇవ్వాలని కేంద్రం చెబితే, రాష్ట్రంలో రెండు బల్బులు మాత్రమే ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ తిరిగి ప్రధాని కావడం ఖాయమన్నారు.
రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీకి 30 సీట్లకు మించి గెలిచే పరిస్థితి లేదన్నారు. సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ నీతి ఆయోగ్ వచ్చిన తరువాత దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా అన్నదే లేదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని పరిశ్రమలకు రాయితీలు మాత్రమే కొనసాగిస్తున్నారని వివరించారు. విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. త్వరలోనే రైల్వే జోన్‌ను ప్రకటించనున్నారని స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాకలపాటి సన్యాసిరాజు, జిల్లా ఇన్‌ఛార్జి రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు, బి.శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.