ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబే పోలవరం కాంట్రాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 14: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టరుగా వ్యవహరిస్తున్నారని, సబ్-కాంట్రాక్టులిచ్చి కమిషన్లు దండుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నూటికి నూరు శాతం నిధులు కేంద్రానివేనన్నారు. ‘ఇస్కాన్’ సంస్థ రాజమహేంద్రవరం ప్రధాన ప్రతినిధి సత్యగోపీనాధ్ దాస్ స్వామీజీ బుధవారం రాజమహేంద్రవరంలో కన్నా లక్ష్మీనారాయణ సమక్షంరో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలవరం నిర్మాణంలో నాణ్యత లోపించిందని, భూసేకరణలో అన్యాయం, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్రంపై బురద జల్లుతూ నిధులను దోచుకుంటున్నారని, దోచుకుంటుంటే అడగడానికి వీల్లేదన్నట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు. పోలవరంలో అక్రమాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తామని, ఎవర్నీ వదిలేదన్నారు.
అక్రమంగా సంపాదించిన వారిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేస్తుంటే రాష్ట్రంపై దాడి చేస్తున్నట్టు వ్యవహరించడం విడ్డూరమన్నారు. ప్రజల సొమ్ముతో భారతదేశం అంతా తిరుగుతూ వివిధ పార్టీల నేతలకు సన్మానాలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రజాస్వామ్యం గురించి నిత్యం మాట్లాడే చంద్రబాబునాయుడు అప్రజాస్వామికంగా నేతలను గృహ నిర్భంధాలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబునాయుడు ఓటమి భయంతో విపక్షాల గొంతు నొక్కాలనే పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
ఈ నెల 19 నుంచి 24 వరకు ఏపీ అక్రమ భూసేకరణపై బీజేపీ రిలే దీక్షలు చేపడుతుందని కన్నా తెలిపారు. 19న విజయవాడలో ప్రారంభించి, 24న మచిలీపట్నంలో ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయిలో రెండేసి రోజులు ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అమరావతి, కాకినాడ సెజ్, భోగాపురం ఎయిర్‌పోర్టు, మచిలీపట్నం పోర్టు ఈ నాలుగు ప్రాజెక్టుల్లో అవసరానికి మించి భూసేకరణ చేసి, నిబంధనలకు నీళ్ళొదిలారన్నారు.
ప్రధానంగా అమరావతి ప్రాంతంలో దళితుల భూములకు ఒక రేటు, పెద్దల భూములకు ఒక రేటు చొప్పున చెల్లించారని ఆరోపించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ నిన్నటి వరకు విమర్శించిన చంద్రబాబునాయుడు ఇపుడు తల్లి కాంగ్రెస్ చంక ఎక్కి, పిల్ల కాంగ్రెస్‌ను చంకలో పెట్టుకుని తిరుగుతున్నారని కన్నా ఎద్దేవాచేశారు.
ఇస్కాన్ బాధ్యతలకు రాజీనామా
ప్రజాసేవలోకి వెళ్ళాలని ఇస్కాన్ బాధ్యతలకు రాజీనామా చేశానని సత్యగోపీనాధ్ దాస్ చెప్పారు. ఇస్కాన్ జాతీయ కమిటీకి రెండుసార్లు ఛైర్మన్‌గా, మధ్యాహ్న భోజనం జాతీయ కమిటీకి ట్రస్టీగా వ్యవహరించానన్నారు. దక్షిణ భారత దేశానికి ఐదుసార్లు ఛైర్మన్‌గా వ్యవహరించానన్నారు. ఈ బాధ్యతలకు రాజీనామా చేసి బీజేపీ అనే పెద్ద కుటుంబంలోకి చేరానన్నారు. మన హైందవ సంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని, భవిష్యత్‌లో ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ ఆశయాలను ఏపీ అంతా తీసుకెళ్ళేందుకు సిద్ధంగా వున్నానని, శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కన్నా అధ్యక్షుడుగా అయిన తర్వాత బీజేపీకి మరింత వైభవం వచ్చిందన్నారు.