ఆంధ్రప్రదేశ్‌

‘కిసాన్ రాజా’తో మంచినీటి పథకాల పర్యవేక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: రాష్ట్రంలోని వివిధ మంచినీటి ప్రాజెక్టులను కిసాన్ రాజా యాప్ ద్వారా రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టును కృష్ణా జిలాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ రాజా యాప్‌తో ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో 500 మంచి నీటి పథకాలను పర్యవేక్షించనున్నామన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పరికరాలు సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మంచినీటి పథకాలు, వాని పనితీరు, నీటి లభ్యత, నీటి సరఫరా ఈ యాప్ ద్వారా తెలుస్తుందన్నారు. ఏదైనా పథకంలో సమస్య కారణంగా నీటి సరఫరా ఆగితే, వెంటనే తెలిసే వీలు ఉంటుందన్నారు. దీంతో త్వరితగతిన మరమ్మతులు చేసే వీలు ఉంటుందన్నారు. తొలుత కృష్ణా జిల్లాలో ప్రారంభించి మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో 100 పెద్ద మల్టీ విలేజ్ స్కీమ్స్‌ను ల్యాబ్స్ ద్వారా కాకుండా, సెన్సర్ల ద్వారా నీటి నాణ్యత తెలుసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. తీర ప్రాంతాల్లోని మంచినీటి పథకాలకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆటోమేటిక్‌గా పని చేసే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లోని 738 ఓవర్ హెడ్ ట్యాంక్‌ల మరమ్మతులు వేగంగా చేయాలని ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల-2లో భాగంగా 103 క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. 221 కోట్లతో 103 మదర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లోని మంచినీటి పథకాలు, చేతిపంపుల పనితీరు ప్రతి ఆరు నెలలకు పర్యవేక్షించాలన్నారు. పని చేయని పథకాలపై దృష్టి సారించాలని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చేతిపంపులే ఆధారం అవుతున్నాయని గుర్తు చేశారు. అన్ని చేతి పంపులను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. నీటి లభ్యతపై శాస్ర్తియంగా విశే్లషించాకే, కొత్తగా మంచినీటి పథకాలను ప్రారంభించాలని స్పష్టం చేశారు.
మియావాకీ విధానంలో మొక్కల పెంపకం
పంచాయతీ రాజ్, అటవీ శాఖ అధికారులతో రాష్ట్రంలో మియావాకీ విధానంలో మొక్కలు నాటడంపై బుధవారం మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం ఉండాలని, 12,918 గ్రామాల్లో మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 10 ఎకరాల్లో ఈ విధానంలో మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 1.2 లక్షల మొక్కలు నాటాలన్నారు. తీర ప్రాంతాల్లో మొక్కలు నాటి బయో షీల్డ్ ఏర్పాటు చేయాలన్నారు. నవంబర్‌లో మియావాకీ విధానంలో 100 ఎకరాల్లో మొక్కలు నాటాలన్నారు.