ఆంధ్రప్రదేశ్‌

రేపటి నుంచి ప్రపంచ స్థాయి బోట్ రేసింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడలో అంతర్జాతీయ బోట్ రేసింగ్ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణానది పున్నమి ఘాట్‌లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో అంతర్జాతీయ స్పీడ్ బోట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేశ విదేశాల నుంచి అంతర్జాతీయ రేసర్లు బోట్లతో సహా విజయవాడ చేరుకున్నారు. వాస్తవానికి ఇలాంటి బోట్‌రేస్‌లు ఇప్పటి వరకు లండన్, పోర్చుగల్, ఫ్రాన్స్, చైనా దేశాల్లోనే జరిగాయి. ఇక ఈ అంతర్జాతీయ బోట్ రేసింగ్‌లో 18 దేశాల నుంచి ఎఫ్1హెచ్2వోకు చెందిన 19 పవర్‌బోట్లు, ఎఫ్4కు చెందిన పది బోట్లు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ, మాలక్ష్మీ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతి బోటు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నది. ఈపోటీలు కృష్ణానదిలో రెండు కిలోమీటర్ల పరిధిలో జరుగనున్నాయి. 16వ తేదీ ఉదయం ట్రైల్స్ జరుగుతాయి.
మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారు. 17, 18 తేదీల్లో కూడా ఈ పోటీలు కొనసాగుతాయి. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ బోట్ రేసింగ్‌లు పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. 18 సాయంత్రం జరిగే ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఈ పోటీల కోసం పున్నమిఘాట్ వద్ద భారీ స్థాయిలో షామియానాలు, కుర్చీలు సిద్ధం చేశారు. అలాగే దేశ విదేశీలను ఆకర్షించేలా బరంపార్క్, దుర్గాఫ్లైఓవర్ ప్రాంతంను అందంగా పూలమొక్కలు, రంగురంగుల విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. ప్రధానంగా ఫ్లైఓవర్ దిగువ 800 మీటర్ల పొడవునా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల ఫౌంటెన్లు, పిల్లలు ఆడుకునేందుకు పార్క్, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్ ఆకారంలో జారుడుబల్ల, పలురకాల ఆట వస్తువులు, గ్రానైట్ బెంచీలు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. ఇదిలా ఉండగా నగర ప్రజల సందర్శనార్ధం గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పోటీల్లో పాల్గొనే స్పీడ్‌బోట్లను ప్రత్యేక వాహనాల్లో ఉంచి స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ప్రదర్శింబోతున్నామని పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ హిమాన్షు శుక్లా తెలిపారు. పోటీల ముగింపు సభలో గ్లోబల్ మ్యూజికల్ ఫెస్టివల్ జరగనుంది. ఈ పర్యటనలో కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు పలువురు నిర్వాహకులతో సమావేశమై సమీక్షించారు.