ఆంధ్రప్రదేశ్‌

పోలీసులను అవమానించేలా డ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 15: వేలకిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిపై ఈగ వాలనీయకుండా భద్రత కల్పిస్తున్న రాష్ట్ర పోలీసులను అవమానించేలా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ పాలనలోనైనా పోలీసులు చట్టప్రకారం తమ పని తాము చేసుకుంటూ పోతారని, అయితే గత 22 రోజులుగా సొంత మీడియాలో వైకాపా నేతలు ఇప్పటికీ నాటకాన్ని రక్తి కట్టిస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. గురువారం గుంటూరు జిల్లా పెదకూరపాడులో స్థానిక ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్‌తో కలిసి మంత్రి సోమిరెడ్డి విలేఖర్లతో మాట్లాడారు. జగన్‌పై చంద్రబాబే నేరుగా హత్యాయత్నం చేయించినట్టు, అది రుజువైనట్టు సొంత మీడియాలో దుష్ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారని, వైసీపీ నేతల తీరుపై జనం నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవాచేశారు. చట్టప్రకారం వైజాగ్‌లో ఫిర్యాదు చేయకపోగా ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి స్టేట్‌మెంట్ కోరినప్పటికీ నిరాకరించి రాజ్‌భవన్, రాష్టప్రతి భవన్ చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. పోలీసుస్టేషన్‌లను ఎత్తివేసి రాజ్‌భవన్, రాష్టప్రతి భవన్‌లలో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతారేమోనని ఎద్దేవా చేశారు. క్రైమ్ రేట్ అధికంగా ఉండే యుపి, బీహార్‌లలో సైతం పదవి కోసం ప్రతిపక్ష నేతను సీఎం.. సీఎంను ప్రతిపక్ష నేతలు హత్యచేయించిన ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి స్వచ్ఛమైన బ్యాక్‌గ్రౌండ్ ఉందని, వైసీపీ నేతలదే నేరచరిత్ర అన్నారు. పాదయాత్రలో ఉన్న జగన్‌కు మూడంచల భద్రత కల్పిస్తున్నామని, భద్రతా సిబ్బందిని కూడా పెంచామన్నారు. వైఎస్‌ఆర్, చంద్రబాబు, షర్మిల, జగన్, ఎవరు పాదయాత్ర చేసినా ఇప్పటివరకు ఆటంకం కల్గించే చర్యలకు ఎవరూ పాల్పడలేదని, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కోడికత్తి డ్రామా ఆడుతున్నారంటూ విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు నాటకాలకు తెరదించాలని సోమిరెడ్డి హితవుపలికారు.