ఆంధ్రప్రదేశ్‌

వంద రోజుల్లో 3 లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 15: రానున్న 100 రోజుల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ పనితీరును గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మూడు నెలలు గృహ నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలన్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లతో పాటు 2019-20 సంవత్సరానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షల ఇళ్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో 2 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, దీనిని దృష్టిలో ఉంచుకుని భారీగా ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. ఆయా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను డిసెంబర్ నెలలో అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలన్నారు. గృహ నిర్మాణం ఎక్కువగా జరుగుతున్న కారణంగా క్షేత్ర స్థాయిలో ఇంజనీరింగ్ సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. అవసరమైన మేరకు ఒప్పంద విధానంలో ఇంజనీర్లను నియమించుకోవాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లలో 1.25 లక్షలు, కొత్తగా గ్రామీణ ప్రాంతాలకు మంజూరు చేసిన ఇళ్ల నుంచి 1.25 లక్షలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 75 వేల ఇళ్లను పూర్తి చేస్తామని ఆ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే తెలిపారు.

గిరిజన ప్రాంతాన్ని దోచుకుంటున్న బాబు
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ
రాజవొమ్మంగి, నవంబర్ 15: రాష్ట్రంలో గిరిజన ప్రాంతాన్ని దోచుకుంటున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగిలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కన్నా మాట్లాడుతూ గిరిజనులంటే చంద్రబాబుకు గిట్టదని, నాలుగున్నర ఏళ్లుగా గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం కల్పించని చంద్రబాబు కపట ప్రేమను కురిపిస్తూ తాజాగా కిడారి శ్రావణ్‌కు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఇది గిరిజనులకు ఒక బిస్కెట్‌లా పనిచేస్తుందని సీఎం భావిస్తున్నారని, గిరిజనులంతా ఈ విషయాన్ని గమనిస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతం టీడీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఖనిజ సంపదను తరలించుకుపోయేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఏజెన్సీ అంతటా గనుల తవ్వకం విచ్చలవిడిగా సాగుతోందన్నారు. గిరిజన గ్రామాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా సరే నాయకులు ఖనిజాలను తవ్వేసుకుంటున్నారని ఆరోపించారు. గిరిజన పల్లెల్లో ముక్కుపచ్చలారని పసి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారని, రోజురోజుకీ మాతా శిశు మరణాలు పెరిగిపోతున్నాయని, గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యవర్గంతో కన్నా లక్ష్మీనారాయణ పదవీ స్వీకారం చేయించారు. ఎస్టీ మోర్చ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కోసూరి కాశీవిశ్వనాథ్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. గిరిజనుల అభివృద్ధికి తాము కృషిచేస్తామని మోర్చ నాయకులు ప్రకటించారు. కన్నా లక్ష్మీనారాయణకు గిరిజనులు అడ్డాకులతో తయారుచేసిన టోపీతో సన్మానించారు.