ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే నిధులివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, నవంబర్ 16: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిరలో హంద్రీనీవా కాలువ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రానికి అవసరమైన నిధులు సక్రమంగా మంజూరు చేయలేదన్నారు. ఫలితంగా పోలవరం, గాలేరు-నగరి వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో సాగునీరు అందక వ్యవసాయ భూములు బీళ్లుగా మారాయన్నారు. అనంతపురం జిల్లాలోని చెరువులను నీటితో నింపేందుకు 2012లో శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా జీడిపల్లి వరకు నీరు తీసుకొచ్చామన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం హంద్రీనీవా కాలువ పనులు సకాలంలో పూర్తిచేయని కారణంగా చాలా చెరువులకు కృష్ణాజలాలు అందని పరిస్థితి కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి డిసెంబర్ చివరినాటికి జిల్లాలోని అన్ని చెరువులకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రాలకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు వీలవుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.