ఆంధ్రప్రదేశ్‌

బీసీలంతా తెలుగుదేశం వెంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: రాష్ట్రంలో బీసీలందరూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బలహీనవర్గాల పార్టీ.. వారంతా మనవెంటే అన్నారు.. మీ పని మీరు చేయండి.. నా సర్వేలు నాకు ఉన్నాయి.. నాడు కాంగ్రెస్ పార్టీ బీసీలను అణచివేసింది.. నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నట్టేట ముంచారు.. అయినా వెనుకాడేదిలేదు.. బీసీలకు రాజకీయంగా ప్రాతినిథ్యం కల్పించింది టీడీపీ.. భవిష్యత్‌లో కూడా అదే ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రాజమండ్రిలో వచ్చేనెల 30న జయహోబీసీ భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో శుక్రవారం జరిగిన సన్నాహక కార్యశాల ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే 45 రోజులలో తెలుగుదేశం కార్యకర్తలు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రచార చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో.. భవిష్యత్‌లో ఇంకా ఏం చేయవచ్చో దిశానిర్దేశానికే ఈ సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మారుమూల గ్రామాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కదలివెళ్లాలని కోరారు. బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. రాజకీయంగా ఎదగటానికి అవకాశాలిచ్చి వారిలో ఆత్మవిశ్వాసం నింపిందని చెప్పారు. నాయకులు కొందరు ప్రజాప్రతినిధులుగా..మరికొందరు ప్రభుత్వాధినేతలుగా.. ఇంకొందరు పార్టీ నాయకులుగా రాణిస్తున్నారని వివరించారు. నాయకులుగా తయారైతే పార్టీ వివిధ విభాగాల్లో వారి సేవలు వినియోగించుకుంటుందని తెలిపారు. బీసీలు తమ వెంటరారని, అండగా ఉండరని భావించిన కాంగ్రెస్ తన పదేళ్ల పాలనలో వారిని అణచివేసిందని చెప్తూ వైఎస్ హయంలో వారికి అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిందని దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలోపడిన సందర్భాల్లో, ఏకఛత్రాధిపత్యంతో నియంతృత్వ ధోరణులు ప్రదర్శించినప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒకే వేదికపై తీసుకొచ్చి జనతా పార్టీ హయాం తరువాత కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో ముఖ్యభూమిక వహించామని గుర్తుచేశారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానులుగా పనిచేయటం వెనుక నాడు తమ కృషి ఉందన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సుస్థిరత కోసం మంత్రివర్గంలో చేరాలని, టీడీపీకి ఎనిమిది మంత్రి పదవులు ఇస్తామని ప్రకటించినా తాము తిరస్కరించామని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశామని ప్రధాని పదవి వరించి వచ్చినా రాష్ట్రం కోసం సున్నితంగా తిరస్కరించామని తెలిపారు.
రాష్ట్ర విభజనలో భాగస్వామ్యపాత్ర పోషించి, ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన ఒప్పందం అమలు చేస్తామని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుంటే ఎన్డీయే నుంచి వైదొలగామని పునరుద్ఘాటించారు. ఓ వైపు రాజ్యాంగ వ్యవస్థలను కుప్పకూల్చి రాష్ట్రాల భవిష్యత్‌తో చలగాటమాడుతూ మోదీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. ఈ సధలో సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ పేరుతో ప్రతిపక్షాలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు రంగంలో దిగితే మంచి స్పందన వస్తోందని చెప్పారు. వాజ్‌పేయి హయంలో ప్రభుత్వ సుస్థిరత కోసం కనీసం రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని తీసుకోవాలని కోరితే దళితుడైన బాలయోగిని స్పీకర్‌ను చేశామన్నారు. బాలయోగి సకాలంలో ఢిల్లీకి చేరుకోలేకపోతే స్పీకర్ పదవికి నామినేషన్ వేయాలని నాటి సీనియర్ ఎంపీ ఎర్రన్నాయుడును ఆదేశించామని నాటి పరిణామాలను గుర్తుచేశారు.
దేశాన్ని నడిపే నాయకుడుగా మోదీ విఫలమయ్యారని, ముందుచూపులేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా, పెద్దనోట్లు రద్దుచేసి దేశ ప్రజలకు నరకం చూపారని ధ్వజమెత్తారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు, ఆదాయం పెంచి వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆదరణ పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్‌లో ఈ పథకాన్ని నీరుగార్చారని ఆరోపించారు. ప్రస్తుతం రూ 760 కోట్లతో రెండులక్షల మందికి పరికరాలు పంపిణీచేసి వారి జీవనోపాధులకు భరోసా ఇచ్చామని, చరిత్ర సృష్టించామన్నారు. మరికొన్ని దశల్లో పంపిణీ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆదాయంలేదు..రాజధాని లేకుండా కట్టుబట్టలతో, అప్పులతో బయటకు వచాచ్మని అదే సమయంలో కరవు, తుపాన్లు వెంటాడాయని అయినా దర్శనికపత్రాన్ని రూపొందించుకుని పద్ధతిగా పాలించి దేశంలోనే రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలిపామన్నారు. వచ్చేనెల 30న రాజమండ్రిలో జరగనున్న జయహో బీసీ సభకు భారీగా ప్రాచుర్యం కల్పిస్తూ ప్రజల్లోకి వెళ్లినప్పుడు నాలుగేళ్ల ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని, అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.