ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి పుట్టపర్తి సత్యసాయి 93వ జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 17 : పుట్టపర్తి సత్యసాయి బాబా 93వ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. సత్యసాయి మహాసమాధిని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. పుట్టపర్తి వీధులు రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. వారం రోజుల పాటు జరిగే వేడుకల్లో దేశ విదేశాల్లో ఉన్న సాయి భక్తులు పాల్గొంటారు. మొదటి రోజు ఆదివారం శ్రీ వేణుగోపాల్‌స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. 19వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20, 21న ఆధ్యాత్మిక సమ్మేళనాలు, 22న సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 37వ స్నాతకోత్సవం, 23న భగవాన్ సత్యసాయి జయంతి నిర్వహిస్తారు. 24న జరిగే కార్యక్రమాలతో వేడుకలు ముగుస్తాయి. వేడుకల్లో పాల్గొనే భక్తులకు అన్నదానం, నారాయణసేవ నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. సత్యసాయి జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. భక్తులు పెద్దసంఖ్యలో ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు.

హజ్‌యాత్ర దరఖాస్తు గడువు డిసెంబర్ 12 వరకు పెంపు
విజయవాడ, నవంబర్ 17: 2019 హజ్‌యాత్రకు ఏపీ నుంచి సుమారు 3వేల మంది వెళ్ళే అవకాశం ఉంది. అయితే తొలుత పేర్కొన్న గడువు ప్రకారం ఈ నెల 17వ తేదీ సాయంత్రం వరకు తక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపడానికి చివరి తేదీ డిసెంబర్ 12వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ లియాఖత్ అలీ తెలిపారు. హజ్ కమిటీ లేకపోవడం, పైగా హజ్ యాత్రికులపై జీఎస్‌టీ విధించడంతో పాటు చాలా తొందరగా అక్టోబర్ నెలలోనే 2019 హజ్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తులు తక్కువగా వచ్చాయంటూ ఈ ఏడాది 2019 హజ్ కోసం ఆంధ్రప్రదేశ్ హజ్ కోటా కింద 3వేల మంది హజ్ యాత్ర చేసుకునే అవకాశం ఉందన్నారు.