ఆంధ్రప్రదేశ్‌

వేల కోట్లు దోచేస్తున్నారు... మీ ధన దాహం తీరదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: రాష్ట్రాన్ని దోచేస్తున్నారు... వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు... అయినా మీ ధన దాహం తీరదా? విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా దిగమింగే ఆలోచన చేస్తున్నారు... అమాయకులైన అగ్రిగోల్డ్ బాధితుల ఉసురు మీకు తగలక మానదంటూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. విశాఖ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 16లక్షల మందికి పైగా అగ్రిగోల్డ్ ఖాతాదారులు ఉన్నారని, వారి దగ్గర నుంచి సేకరించిన సొమ్ముతో సంస్థ కూడబెట్టిన ఆస్తులను కారు చౌకగా కొట్టేసేందుకు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, మంత్రులు, ఇతర నాయకులు కుట్రలు పన్నుతున్నారని వైసీపీ అసెంబ్లీలోనే స్పష్టం చేసిందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి ఖాతాదారుల డిపాజిట్‌లు చెల్లిస్తామంటూ అప్పట్లో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే, సంస్థ ఆస్తులను అప్పనంగా దోచుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకున్న టీడీపీ ఆస్తుల విలువను క్రమంగా తగ్గించుకుంటూ రావడంతో పాటు ఇప్పుడు ఆస్తులనే అగ్రిగోల్డ్ యాజమాన్య హక్కుల నుంచి తప్పిస్తోందని మండిపడ్డారు.
విజయవాడలోని హాయ్ ల్యాండ్ అంశమే అందుకు ఉదాహరణగా బొత్స పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ హాయ్‌ల్యాండ్‌ను తనఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకుని, ఇప్పుడు అసలు అది తమది కాదేకాదంటూ న్యాయస్థానంలో చెప్పడం టీడీపీ దోపిడీకి అద్దం పడుతోందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రతినిధులు(ఒక ఎంపీ, మరో నేత అమర్ సింగ్)ను కొద్దినెలల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కలిశారన్నారు. అప్పటి వరకూ ఆస్తుల కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఆ సంస్థ బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడంలో చంద్రబాబు హస్తం ఉందన్నారు. ప్రజల కడుపులు కొట్టి టీడీపీ నేతలు ఆస్తులు పెంచుకునేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల తరపున వైసీపీ పోరాడుతుందని, న్యాయం జరిగే వరకూ వదిపెట్టమని హెచ్చరించారు. ఇక రాష్ట్రంలో సీబీఐని అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకునేలా ప్రభుత్వం జీఓ 190ని తీసుకువచ్చిందని, ప్రభుత్వం ఇచ్చిన జీవో చిత్తుకాగితంతో సమానమని బొత్స పేర్కొన్నారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంతర్భాగమేనని, తీవ్ర నేరాలు, ఆర్థిక తప్పిదాలు చోటుచేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకో, న్యాయ స్థానం ఆదేశాల మేరకో సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలు దాడులు చేస్తాయన్నారు. వీటిని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. మీరు, మీ పార్టీ నేతలు పాల్పడుతున్న అవినీతి, అక్రమాలపై ఎప్పటికైనా సీబీఐ విచారణ జరుగుతుందని భావించి భయంతోనే ముందుగా ఆయా సంస్థలను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం ఘటనలో కూడా తమ తప్పిదం లేదని, కేంద్రం ఆధీనంలోని ఎయిర్‌పోర్టు భద్రత వ్యవస్థదే అంటూ ప్రకటించిన చంద్రబాబు అక్కడ కూడా సీబీఐ విచారణ అంగీకరించకుండా జీవో జారీ చేశారన్నారు. హత్యాయత్న ఘటనలో ప్రభుత్వ జోక్యం బయటపడుతుందన్న భయంతోనే సీబీఐ విచారణకు నో చెబుతున్నారన్నారు.