ఆంధ్రప్రదేశ్‌

పందెం కోళ్ల కోసం వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 18: పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాల సీజను వచ్చేసింది. వచ్చేది ఎన్నికల సీజను కావడంతో సంక్రాంతి సీజను కాస్త ముందే వచ్చేసింది. సంక్రాంతికి సంప్రదాయం ముసుగులో ఏటా ఈ జిల్లాలో కోడి పందాల జాతర జరుగుతుందనేది అందిరికీ తెలిసింది. అయిత ప్రతీసారీ అనుమతి వస్తుందా, రాదా అనే సందిగ్ధంతో పందేలరాయుళ్లు, నిర్వాహకులు కాస్త ఆలస్యంగా రంగంలోకి దిగేవారు.
అయితే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు తప్పనిసరిగా అనుమతులిప్పిస్తారనే ధీమాతో ఈ ఏడాది కాస్త ముందుగానే సీజను మొదలయ్యింది. బరిలో నిలపడానికి అవసరమైన పుంజుల కోసం పందేలరాయుళ్లు వేట ప్రారంభించారు. పుంజులు సిద్ధంగా ఉన్నవారు వాటిని పందేలకు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. శీతాకాలం కావడంతో చాలా జాగ్రత్తగా పుంజులను పెంచుతున్నారు. మరోపక్క పందేల నిర్వహణకు ఎక్కడెక్కడ బరులను సిద్ధం చేయాలో ఎంపిక చేసుకునే పనిలో నిర్వాహకులున్నారు. రానున్నది సార్వత్రిక ఎన్నికల సీజన్ కావడంతో ఎక్కడికక్కడే అనుమతుల వచ్చేస్తాయనే ధీమాతో నిర్వాహకులున్నారు. రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న నేతలు తమ నియోజకవర్గాల పరిధిలోనే పెద్ద బరి వేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయంగా ఎంతటి బద్ధ శత్రువులైనా, కోడి పందేల విషయంలో మాత్రం కలిసిపోవడం గోదావరి జిల్లాల నేతలకు ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇప్పించడానికి అధికార పార్టీ నేతలు సమాయత్తమవుతుంటే ఇతరత్రా ఏర్పాట్లలో మిగిలిన పార్టీల నేతలు తలమునకలవుతున్నారు.
పందేలరాయుళ్లు గోదావరి జిల్లాల్లో అనువైన ప్రాంతాలను ఎంచుకుని, అక్కడకు పుంజులను తరలించే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో పెంచుతున్న పందెం పుంజులను ఈ ప్రాంత వాతావరణానికి అలవాటుచేయాలి. ఇందుకోసం భారీ ఎత్తున సామాగ్రిని కొనుగోలు చేసుకుని మరీ తెలంగాణ ప్రాంతాల నుంచి పందాల రాయుళ్ళు తరలివచ్చే పనిలో ఉన్నారు.
కాగా సంక్రాంతి పందేల జాతరలో ఉపయోగించే పుంజుల సత్తాను తెలుసుకునేందుకు గ్రామాల్లో పరీక్షలు సైతం ప్రారంభించారు. కోడి కాళ్లకు కత్తులు కట్టకుండా ఈ పందేలను నిర్వహిస్తున్నారు. ఈ సన్నాహక పరీక్షల్లో గెలిచిన పుంజులకు మరింత ప్రత్యేక తర్ఫీదునిచ్చి, పందేల బరిలో దింపుతారు.