ఆంధ్రప్రదేశ్‌

తారస్థాయికి తెరాస విభేదాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 18: ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రధానంగా వైరా, మధిర, సత్తుపల్లి, పినపాక, అశ్వారావుపేట అభ్యర్థుల ఎంపికపై ఆయా నియోజకవర్గాల్లోని నేతలు మొదట్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తరువాత పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని అన్నిచోట్ల నేతల్లో ఉన్న అసంతృప్తిని చల్లబర్చినా వైరాలో మాత్రం అది సాధ్యం కాలేదు. వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు, సభలు సైతం జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మదన్‌లాల్, పార్టీ నాయకులకు మధ్య సయోధ్య కుదరలేదు. తాజాగా వారంతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని దాదాపు 33మంది ప్రజాప్రతినిధులతో పాటు ప్రధాన నేతలంతా పార్టీని వీడటం గమనార్హం. అయితే వీరంతా అసంతృప్తిగా ఉన్నప్పటికీ అభ్యర్థి వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయకపోవడంతో వివాదం మరింత ముదిరేలా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో అసంతృప్త నాయకులు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన వారంతా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులుగా ముద్రపడ్డారు. వీరంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన నాయకత్వంలో తెరాసలో చేరినవారే. వీరిని బుజ్జగించేందుకు ఎంపీ కూడా ప్రయత్నించారనే ప్రచారం ఉంది. అయితే తెరాస అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన పొంగులేటి మాత్రం మదన్‌లాల్ వైఖరిని తప్పుబట్టారు. పార్టీ నేతల పైనే కేసులు పెట్టించడం, తనను విస్మరించడం లాంటి విషయాలను బహిరంగ వేదిక పైనే ప్రస్తావించారు. ఆ తరువాత కూడా మదన్‌లాల్ సయోధ్యకు ప్రయత్నించలేదనే విమర్శలున్నాయి. వైరా నియోజకవర్గంలో పార్టీకి రాజీనామా చేసిన వారంతా మహాకూటమి రెబల్ అభ్యర్థి రాములు నాయక్‌కు మద్దతిస్తామని ప్రకటించడం సంచలనం రేపింది.
మహాకూటమి పొత్తుల్లో భాగంగా వైరా స్థానాన్ని సీపీఐకి కేటాయించగా కాంగ్రెస్ నేత రెబల్‌గా నామినేషన్ వేయడం, ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు తెరాసకు రాజీనామా చేసిన నేతలు కూడా పనిచేస్తుండటం విశేషం. అయితే రాములు నాయక్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించినప్పటికీ ఆయన పట్టించుకోకుండానే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మద్దతుదారులంతా ఈ నెల 20 నుంచి అన్ని గ్రామాల్లోనూ ప్రచారం చేయనున్నట్లు వివరించారు.