ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్, టీడీపీ కలయిక అపవిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, నవంబర్ 18: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కలయిక అపవిత్రమని కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో ఎందుకు జతకట్టాల్సి వచ్చిందో బాబు స్పష్టం చేయాలన్నారు. కాపు, బలిజల రిజర్వేషన్‌పై సీఎం అబద్దాలు చెబుతూ నాటకాలు ఆడుతున్నారన్నారు. రిజర్వేషన్ 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు చెప్పిందంటూ పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.
మహారాష్టల్రో మరాఠీలకు 16 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు కూడా జారీ చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే మహారాష్ట్రంలో 62 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, అయినప్పటికీ రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన సాహసం మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయకపోతున్నారన్నారు. అందువల్లే కాపు, బలిజలు ఉద్యోగాలు రాక, సంక్షేమ పథకాలు అందక నష్టపోతున్నారని అన్నారు. సుప్రీం పేరు చెబుతూ చంద్రబాబు కాపు, బలిజలను మభ్యపెడుతన్నారన్నారు. కాపు, బలిజలకు ఐదు శాతం రిజర్వేషన్ అంటూ అసెంబ్లీ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపి ముఖ్యమంత్రి చేతులు దులుపుకున్నారన్నారు. కాపు, బలిజలకు ఎఫ్ కేటగిరీ కింద రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసి అమలు చేస్తే 10 లక్షల మందితో ముఖ్యమంత్రికి సన్మానం చేస్తామని చెప్పామని, అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని అన్నారు. కాపు, బజలకు న్యాయం చేసిన వారికే తమ మద్దతు ఉంటుందని ముద్రగడ స్పష్టం చేశారు.
జనసేన నేత పవన్ కల్యాణ్ తమ సామాజిక వర్గానికి చెందిన వాడైనప్పటికీ జాతి ప్రయోజనాలు కాపాడుతానని ముందుకు వస్తేనే మద్దతు ఇస్తామని ముద్రగడ స్పష్టం చేశారు. ఇంతవరకు పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడ లేదని అన్నారు. పవన్ ప్రకటనపైనే తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. రావులపాలెం సంఘటన తరువాత కాపు జాతి అభివృద్ధి, రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కాపు, బలిజలను, వారి పోరాటాలను విస్మరించి నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ తమ జాతికి మేలు చేస్తుందో ఆ పార్టీ వెంట నడుస్తామన్నారు. ఎస్సీ, బీసీలతో కలిసి అసెంబ్లీలో తమ గొంతు వినిపించివారిని శాసనసభకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈమేరకు ఎస్సీ, బీసీ నాయకులతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.