ఆంధ్రప్రదేశ్‌

నేడు మమతతో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 18: దేశవ్యాప్తంగా బీజేపీ యేతర ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మమతతో భేటీ కావటం, ఆపై స్తబ్దత నెలకొన్న నేపథ్యంలో బీజేపీ యేతర పార్టీలతో ఏర్పాటు కానున్న ప్రత్యామ్నాయ పొత్తులపై చంద్రబాబు, మమతా బెనర్జీ సమాలోచనలు జరపనున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు కుమారస్వామి, విజయన్, జమ్మూకాశ్మీర్‌లోని నేషనల్ ఫ్రంట్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే అధినేత స్టాలిన్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, తదితరులతో కీలక సమావేశాలు నిర్వహించి ఎన్డీఏ అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రాల అధికారాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు, తదితర అంశాలపై బాబు చర్చించారు. మమతతో భేటీ అనంతరం జనవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి కేంద్రంపై ప్రచ్ఛన్న పోరాటానికి ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంట్ చివరి సమావేశాలు కానున్నందున బీజేపీ యేతర పార్టీల మద్దతు కూడగట్టి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హక్కుల అంశాలపై కేంద్రాన్ని ఆయన ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు. దీనికితోడు రాష్ట్రాలకు ఉన్న అధికారాలు, విధులను తిరగేస్తున్నారు. కేంద్రం పూర్తిస్థాయిలో ఏపీకి సహాయ నిరాకరణ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని జీవో జారీచేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ ఫార్ములాను బీజేపీ యేతర ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో అమలుచేయాలని ఆయా ముఖ్యమంత్రులకు సూచించనున్నట్లు సమాచారం. కాగా మమతతో బాబు భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయం, ఐదు రాష్ట్రాల్లో జగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ యేతర పక్షాల విజయావకాశాలు, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీపై వ్యతిరేక పవనాలు, తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు తెలిసింది. తెలంగాణలో సోమవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనున్న నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రంలో పొత్తులు, అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చిస్తూనే, మరోవైపు జాతీయ స్థాయి నేతలతో వరుస భేటీలు నిర్వహించాలనే యోచనతో చంద్రబాబు ముందుకెళుతున్నారు.