ఆంధ్రప్రదేశ్‌

ఉమ్మడి కార్యాచరణతో ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 13: ఇక నుంచి రాష్ట్రంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతామని వామపక్షాల నేతలు, జనసేన ప్రతినిధులు పేర్కొన్నారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవనంలో సోమవారం వామపక్ష నేతలతో జనసేన ప్రతినిధులు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ఇక ఉమ్మడి కార్యాచరణతో పోరాటాలు చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కరవు మండలాలకు తక్షణమే సాయం అందించాలన్నారు.
వర్షాలు లేక అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి రైతులు వలస వెళ్లిపోతున్నారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ జనసేన, వామపక్షాలు కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతాయన్నారు. రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒకవైపు కంట్రిబ్యూటరీ పెన్షర్ విధానం రద్దు కోసం ఉపాధ్యాయులు నిరసనలు చేస్తుండగా మరొక వైపు కాంట్రాక్టు కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2.10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.