ఆంధ్రప్రదేశ్‌

110 మున్సిపాల్టీల్లో 7.50 లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 13: రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో నిర్మిస్తున్న 7.50 లక్షల ఇళ్లలో వచ్చే ఏడాది మార్చినాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసి, లబ్ధిదారులకు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇందులో రెండున్నర లక్షల ఇళ్లు సొంత స్థలాల్లో నిర్మిస్తున్నామని, స్థలాలు లేని చోట జీ ప్లస్ విధానంలో మరో ఐదు లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలు లేని చోట ప్రైవేటు స్థలాలను సేకరించి. ఇళ్ల సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 500 ఎకరాల భూమి కొనుగోలుచేశామన్నారు. ఏడాదిలోగా అర్హులైన అందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అత్యున్నతమైన నాణ్యతతో ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ వివరించారు. కోట్ల రూపాయలు వెచ్చించి, ఇళ్ల కాలనీలకు అంతర్గత, బహిర్గత సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మున్సిపాలిటీల్లో నిర్మిస్తున్న ఇళ్ల సముదాయాలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సకల సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఒక్క స్విమ్మింగ్ పూల్ తప్ప మిగిలిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అదనంగా మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ఇందులో లక్ష ఇళ్లు శ్లాబు దశకు చేరుకున్నాయన్నారు. లబ్ధిదారుల కళ్లల్లో అనందం చూడాలని ముఖ్యమంత్రి గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, ఇళ్ల నిర్మాణంలో అత్యంత నాణ్యమైన మెటీరియల్ వినియోగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అదర్శవంతంగా షీర్‌వాల్ టెక్నాలజీతో చేపట్టిన ఈ గృహ సముదాయాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. పనె్నండు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారన్నారు. గోవా నుంచి ఆ రాష్ట్ర హోం మంత్రి వచ్చి ఈ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారన్నారు. కంప్యూటరైజ్డు లాటరీ విధానంలో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో రూ. 4000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. నాణ్యమైన ఇళ్లు నిర్మించి, పారదర్శకంగా కేటాయిండానికి బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకొచ్చామన్నారు. విలేఖర్ల సమావేశంలో రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్ పంతం రజనీ శేషసాయి, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కేసుల మాఫీ అంటే జగన్ మనుషులున్నట్టే
తూర్పు గోదావరి జిల్లా తునిలో గతంలో జరిగిన రైలు దహనం కేసులను మాఫీచేస్తానని విపక్ష నేత జగన్ ప్రకటించారంటే ఇందులో ఆయన మనుషులు ఉన్నారేమోననే అనుమానం నిజమవుతోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ వ్యాఖ్యానించారు. చట్టాలు, కోర్టులు వుండగా కేసులు మాఫీ చేస్తానని హామీయిస్తున్నారంటే చట్టాలపై, నిఘా వ్యవస్థలపై జగన్‌కున్న అభిప్రాయం ఏమిటో అర్ధం చేసుకోవచ్చన్నారు.
ముందు జగన్ తనపైవున్న 11 కేసుల నుంచి బయటపడిన తర్వాత రైలు దహనం కేసుల గురించి ఆలోచించాలని మంత్రి ఎద్దేవాచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పీడీ అకౌంట్ అంటే అర్ధం తెలియని నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నిరాధారమైన ఆరోపణలు చేసి గందరగోళాన్ని సృష్టించడం తగదన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఉత్తమ జీవన ప్రమాణాల నగరాలుగా తిరుపతి, విజయవాడ
దేశంలో ఉత్తమ జీవన ప్రమాణాలుగల నగరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 నగరాల్లో తిరుపతి, విజయవాడ నగరాలు ఎంపికయ్యాయని మంత్రి నారాయణ చెప్పారు. మంత్రి రాజమహేంద్రవరంలో సమీక్షా సమావేశంలో ఉండగా ఈ ఎంపిక సమాచారం అందడంతో ఆయన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తిరుపతి, విజయవాడ నగరపాలక సంస్థల అధికారులకు, పాలక వర్గాలకు మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా, వైద్యం, వౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, కాలుష్యరహిత వాతావరణం, క్రైమ్ రేటు తక్కువగా ఉండటం ప్రమాణాలుగా ఈ నగరాల ఎంపిక జరిగిందన్నారు. దేశంలోని 4500 నగరాలకు గాను టాప్ టెన్‌గా ఎంపికైన వాటిలో తిరుపతి 4వ స్థానంలోనూ, విజయవాడ 9వ స్థానంలో నిలిచాయన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 111 నగరాల్లో అధ్యయనం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంలో అనుసరించిన ప్రమాణాల కారణంగానే ఈ ర్యాంకులు సాధ్యమయ్యాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా 4500 నగరాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎంపికయ్యాయని మంత్రి నారాయణ చెప్పారు. భారతదేశంలో 330 మున్సిపాలిటీలను అధ్యయనం చేయగా ఏపీలో 31 మున్సిపాలిటీలు ఎంపికయ్యాయన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఐటీకి సంబంధించి దేశంలోనే ఏపీకి మొదటి ర్యాంక్ వచ్చిందన్నారు. అమృత్ 1, అమృత్ 2 పథకాల్లో భాగంగా రాష్ట్రంలో 33 మున్సిపాలిటీలకు రూ.208 కోట్లు నిధులు వచ్చాయని, ఈ నిధులతో చేపట్టిన పనులు అక్టోబర్, నవంబర్‌కల్లా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టామన్నారు.