ఆంధ్రప్రదేశ్‌

మోదీజీ.. ఈరోజైనా సత్యం పలకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అయినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాస్తవాలను పలకాలని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7 దశాబ్దాలకు పైగా దేశాన్ని అనేకమంది పాలించారని, అయితే హామీల అమలులో విఫలమైన ప్రధానిగా మోదీ మిగిలారని విమర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ప్రజలు స్పందించి అధికారం కట్టబెడితే వారిని అడుగడుగునా వంచించి కష్టాలపాల్జేసిన మోదీకి ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. అత్యంత అసమర్థుడిగా దేశ ప్రజల ఆశలను వమ్ముచేశారని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో వేలకోట్లు దోపిడీచేసి బ్యాంకులను లూటీచేసిన నేరస్థులు విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలను 30శాతం కూడా అమలు చేయలేదన్నారు. ముందుచూపు లేకుండా నిరంకుశ విధానాలను అవలంబించటం వల్ల దేశప్రతిష్ట మంటగలిసిందని మండిపడ్డారు. మోదీ నాయకత్వం దేశానికి శాపంగా పరిణమించిందని విమర్శించారు. మీడియాహౌస్ ద్వారా జర్నలిస్టులు విడుదల చేసిన పుస్తకంలో మోదీ పాలన తిరోగమనంలో ఉన్నట్టు తేలిందన్నారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగలను వంచించారని, జీడీపీ ఎక్కడ పెరిగిందో తేల్చాలన్నారు. వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను గత నాలుగేళ్లలో విపరీతంగా పెంచేసి పేద, మధ్యతరగతి వర్గాలపై అదనపు భారం మోపారని దుయ్యబట్టారు. పెద్దనోట్ల రద్దుతో పేదలకు అన్యాయంచేసి పెద్దలకు వెసులుబాటు కల్పించారన్నారు. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోయేలా మోదీ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. నీరబ్ మోదీ, లలిత్‌మోదీ, విజయ్‌మాల్యా లాంటి బడా పారిశ్రామికవేత్తలు దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాబిన్నంచేసి బ్యాంకులను లూటీచేసి విదేశాలకు పరారైతే వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు.
రాజకీయాల్లో సైతం బీజేపీ ఆర్థిక నేరగాళ్లకు రక్షణ కల్పిస్తోందని విమర్శించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి వంటివారు ప్రధాని కార్యాలయంలో తిరుగాడటమే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రప్రభుత్వ నిర్వాకం వల్ల పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని, నల్లధనాన్ని వెలికితీయటంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా తమిళనాడు, కర్ణాటకలో రాజకీయాలను కలుషితం చేస్తున్న మోదీ ఏపీని దెబ్బతీసే ప్రయత్నాలు ప్రారంభించారని, ఇందులో భాగంగానే పదవుల పందారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను చేసిన తప్పులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అయినా మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.