ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి ‘ఆయుష్మాన్ భారత్’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 14: పేద కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే మోదీ కేర్ (ఆయుష్మాన్ భారత్) పథకం బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుద్దా చంద్రశేఖర్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రధాన మంత్రి మోదీ ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నారని చెప్పారు. దేశంలోని 50 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని, రాష్ట్రంలో 1.40 కోట్ల తెల్ల రేషన్‌కార్డు దారులకు పథకం అందుబాటులోకి రానుందన్నారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, వృద్ధాప్య సమస్యలు తదితర విభిన్న ఆరోగ్య సమస్యలకు ఈ పథకం కింద వైద్యం అందుతుందని హామీ ఇచ్చారు. కూరగాయలు అమ్మేవారు, ఆటోడ్రైవర్లు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, లారీ డ్రైవర్లు, అందరూ పథకం ద్వారా లబ్ధిపొందవచ్చన్నారు. కుటుంబానికి రూ. 5 లక్షల విలువైన వైద్యం అందిస్తారన్నారు. ఈ పథకానికి ప్రీమియాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వమే రూ. 10వేల కోట్లు చెల్లిస్తుందన్నారు. ఈ పథకాన్ని పేదలు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పర్సనల్ డిపాజిట్ ఖాతాల్లోని రూ. 54వేల కోట్ల నిధులను చేసిన ఖర్చుపై అవినీతి జరిగినట్లు బీజేపీ భావిస్తుందని అన్నారు. వాటిని అడిట్ చేయించాల్సిందిగా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.