ఆంధ్రప్రదేశ్‌

స్వర్ణాంధ్రకు స్వచ్ఛంద సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 14: రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు అహరహం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాము కూడా అండగా ఉంటామని సీనియర్ సిటిజన్లు, మాజీ సైనికోద్యోగులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకొచ్చారు. మంగళవారం ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగే 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా వారు ఆహ్వానించారు. రాష్ట్రాన్ని అగ్రపథాన అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే సత్తా సీఎంకే ఉందన్నారు. ఇందులో భాగంగా తమవంతు సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు.
వీసీకి సీఎం అభినందన
నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ ఆర్ సుదర్శనరావు మంగళవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. బాధ్యతలు చేపట్టిన వీసీని అభినందించారు.
నేనున్నానంటూ ఆపన్నులకు భరోసా
నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఏ వివేక్ గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితికి చేరాడు. వైద్యం కోసం విజయవాడలోని డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చేర్చగా రూ. 3లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దినసరి కూలీతో జీవనం సాగించే వివేక్ తల్లిదండ్రులు విధిలేని పరిస్థితుల్లో ఉండవల్లి ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితి వివరించారు. యువకుడి దయనీయ స్థితిపై చలించిన ముఖ్యమంత్రి వెంటనే వైద్యానికి అయ్యే ఖర్చు రూ. 3లక్షలు ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లికి చెందిన ఉప్పులూరి రామానుజమ్మ ఎముకల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్యానికి స్తోమత లేక ఆరోగ్యం సన్నగిల్లి దీనావస్థలో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించింది. దీనిపై స్పందించిన సీఎం రూ. 2లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన విజయవాడకు చెందిన టి రాజాకుమార్, టి రజనికుమారి తమ అమ్మమ్మ గురవమ్మ వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. గురవమ్మ వారిని చదివించలేక నానాఅవస్థలు పడుతోంది. అర్ధంతరంగా చదువు మాన్పించే స్థితిలో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితి వివరించటంతో రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.