ఆంధ్రప్రదేశ్‌

నేడు సిక్కోల్‌లో పంద్రాగస్టు వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 14: రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం పడినప్పటికీ శ్రీకాకుళం తొలిసారి రాష్టస్థ్రాయలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు వేదిక కాబోతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శ్రీకాకుళంలో రాష్టస్థ్రాయిలో ఆగస్టు 15 సంబరాలను ప్రభుత్వం ఇక్కడ నిర్వహించడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవవందనం స్వీకరించడం తొలిసారి కాబోతోంది. ఇంతటి మహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. నగరమంతా విద్యుత్ కాంతులతో తళుకులీనుతోంది. రోడ్లన్నీ శుభ్రమయ్యాయి. రాత్రికి రాత్రే కొత్త రోడ్లు సిద్ధం చేసారు. వాటికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లు సరికొత్తగా నిర్మించారు. గ్రీనరీ సిటీగా మార్చేసారు. నగరం మొత్తంగా క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేసింది.
ఈ వేడుకలకు ఐదు వేల మంది విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. వారందరికీ టీ షర్టులు, టోపీలు, జాతీయ జెండాలు అందజేస్తున్నారు. నగరంలో అనేక చోట్ల భారీ బెలూన్లను ఏర్పాటు చేసారు. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, డైరెక్టర్లు, కమిషనర్లు, జిల్లా అధికారులకు గ్యాలరీలు ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఎదురుగా విద్యార్థులు మువ్వనె్నల జెండాలతో అమరిక చేసేలా రిహార్స్‌లు చేసారు. సాంస్కృతిక కార్యక్రమాలను అరగంట ఉండేలా సమయం కేటాయించారు. అమరావతిపై 50 మంది పిల్లలతో ప్రత్యేక నృత్య ప్రదర్శన, నేను శ్రీకాకుళం పాటు, జాతీయ సమగ్రతపై మరో నృత్యగీతాన్ని ప్రదర్శించేందుకు అనుమతులు ఇచ్చారు. స్వాతంత్య్ర సమరయోధులు వారి కుటుంబ సభ్యులతో ఈ వేడుకలకు హాజరవుతారు. వారిని ముఖ్యమంత్రి నేరుగా కలుసుకుని బాగోగులు తెలుసుకుంటారు. వారితో హై టీ కార్యక్రమం ఏర్పాటు చేసారు. సుమారు 70 అవార్డులు ఇవ్వాల్సి వుండగా, అందులో 51 మంది పోలీసులే. మిగిలిన వారిలో కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి, జేసీ చక్రధరబాబు, ఎస్పీ త్రివిక్రమవర్మ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలకు సీఎం అవార్డులు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో 12 శాఖలకు చెందిన శకటాలను వేడుకల్లో ప్రదర్శించేందుకు రాజవౌళి బాహుబలి సెట్‌ను తలపించేలా సిక్కోల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో సిద్ధం చేసారు. ముఖ్యమంత్రి ప్రొటోకాల్ ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు స్వాతంత్య్ర వేడుకల వేదిక వద్దకు వస్తారు. అంతకుముందే వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అంతా పరేడ్ గ్రౌండ్‌లోకి చేరాలని కలెక్టర్, ఎస్పీలు ప్రకటించారు.

మరో కొత్త పథకం...
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి బుధవారం శ్రీకాకుళం జిల్లా నుంచి స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా బాలింతలకు ‘బసవ తారకం మదర్ కిట్’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు ఈ కిట్లను అందజేస్తారు. ఈ పథకానికి రూ. 37.37 కోట్లను కేటాయించిన ఏపీ ప్రభుత్వం బాలింతలకు అందించే ఒక్కో కిట్ విలువ రూ. 1038 ఉంటుంది.