ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో ఉపాధ్యాయుడి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, ఆగస్టు 14: దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పీఏగా పనిచేసిన ఉపాధ్యాయుడు రమణను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అయితే రమణ చాకచక్యంగా కిడ్నాపర్ల నుండి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. బాధితుడు రమణ కథనం ప్రకారం తిరుపతి పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో నివాసం ఉంటున్న వీరమంగళం వెంకటరమణ పుత్తూరు మండల ఇషా కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన గతంలో దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఆయన మరణానంతరం ప్రస్తుతం ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మకు సహాయకుడిగా ఉంటున్నారు. వెంకటరమణ సోమవారం సాయంత్రం తిరుపతికి వచ్చిన సమయంలో అగంతకులు అతనిపై దాడి చేసి కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. తనను ఒక గదిలో బంధించారని, ఫోన్, బంగారు నగలు లాక్కున్నారన్నారు. పది లక్షలు డిమాండ్ చేశారన్నారు. మంగళవారం వేకువజామున అగంతకులు నిద్రిస్తున్న సమయంలో చాకచక్యంగా తప్పించుకుని వచ్చానని రమణ తెలిపారు.