ఆంధ్రప్రదేశ్‌

జోరు వానలో జెండా పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఆగస్టు 15: 72 గంటలుగా కుండపోత వర్షం..11 సెంటీమీటర్ల వర్షపాతం..ఎడితెరిపిలేని ముసురు, కారుమబ్బుల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జెండా పండుగలో పాల్గొన్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత మొదలైన భారీ వర్షం ఉదయం 8.30 గంటల వరకూ కురుస్తునే ఉంది. సుందరంగా తీర్చిదిద్దిన నగరమంతా జలమయమైంది. బుధవారం ఉదయం 8.45 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానికి ముఖ్యమంత్రి చేరుకున్న సమయానికి వర్షం తాత్కాలికంగా ఆగిపోయింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అంతే, మళ్లీ జోరుగా వర్షం కురియడం మొదలైంది. గొడుగు నీడలోనే రాష్ట్ర ఉత్తమ అధికారులకు ముఖ్యమంత్రి పురస్కారాలు అందించారు. వర్షంలోనే పరేడ్ నిర్వహించిన 11వ బెటాలియన్, 14వ బెటాలియన్ (అనంతపురం), 16వ బెటాలియన్ (ఎపీఎస్‌పీ,విశాఖపట్నం), ఏపీ స్పెషల్ పోలీస్, తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ బ్యాండుపార్టీ, ఎన్‌సీసీ, ఎన్‌సీసీ(బాలికల విభాగం), సైనికస్కూల్ (కోరుకొండ), ఎక్స్ ఆర్మ్‌డ్ ఫోర్సు, గిరిజన విద్యార్థినులు ముఖ్యమంత్రికి గౌరవ వందనం చేసారు. అనంతరం శకటాల ప్రదర్శన జరిగింది. అప్పటికీ వర్షం కురియడం ఆగిపోయింది. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించి అయినంత వరకూ పరేడ్ నిర్వహించిన బృందాలన్నీ తడిచి ముద్దయ్యాయి. మొత్తానికి వాన దోబూచులాట మధ్య జెండాపండుగ ఘనంగా ముగిసింది. సుమారు ఆరువేల మంది ప్రజలు హాజరుకాగా, మరో రెండు వేల మంది విద్యార్థులు ఈ పండుగను తిలకించారు. కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రిని సెరిమోనియల్ పరేడ్‌కు డీజీపీ ఆర్పీ ఠాకూర్, చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.
అనంతరం అక్కడే ఉన్న జీఏడీ ప్రభుత్వ సెక్రటరీ నాగులాపల్లి శ్రీకాంత్, ఇస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్‌కుమార్ మీనా, శ్రీకాకుళం కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి, అడిషనల్ సెక్రటరీ ఎం.అశోక్‌బాబు, విశాఖ రేంజ్ డిఐజీ శ్రీకాంత్, శ్రీకాకుళం ఎస్పీ త్రివిక్రమవర్మలను పరిచయం చేసారు. అనంతరం తొమ్మిది గంటలకు జాతీయపతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఐదుకోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ముగించాక, సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించారు. ఇలా ప్రకృతి ప్రతికూల పరిస్థితుల నడుమ కార్యక్రమాన్ని చాలా దృఢ సంకల్పంతో నిర్వహించారు. ఇందుకుగాను కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి, ఆయన టీంను సీఎం అభినందించారు. అలాగే వర్షంలోనే సెరిమోనియల్ పరేడ్ నిర్వహించిన ఏఎస్పీ గౌతమిషాలినీని కూడా ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావు, పితాని సత్యన్నారాయణ, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, నన్నపనేని రాజకుమారి, ప్రతిభాభారతి, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, తలే భద్రయ్య, చౌదరి నారాయణమూర్తి, అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ కూన రాంజీ, రిజిస్ట్రార్ రఘుబాబు పాల్గొన్నారు.