ఆంధ్రప్రదేశ్‌

సీతమ్మధార హాస్టల్ జెండా పండగకు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 15: భారీ వర్షంలోనూ జాతీయ పతాకాన్ని ఎగరేసి, ప్రజలంతా దేశభక్తిని చాటుకున్నారు. విశాఖ నగరంలోని కార్యాలయాలు, కర్మాగారాలు, కళాశాలలు, విద్యాలయాలు.. ఇలా అన్ని చోట్లా స్వాతంత్య్ర దినోత్స సంబరాలు మిన్నంటాయి. కానీ నగరం నడిబొడ్డునున్న ఒక హాస్టల్‌లో జెండా ఎగరలేదు. అక్కడున్న 102 మంది విద్యార్థులు అల్పాహారం మానేసి నిరసన తెలియచేయడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సీతమ్మధారలోని బాబూ జగ్జీవన్‌రామ్ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో బుధవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగలేదు. ఈ విషయం తెలిసి మీడియా అక్కడికి చేరుకుని దీనిపై ఆరా తీస్తే, బాధాకరమైన అంశాలు వెలుగు చూశాయి. ఇక్కడి హాస్టల్‌లో అనేక సమస్యలు విద్యార్థులను పట్టి పీడిస్తున్నాయి. చినుకుపడితే, హాస్టల్ గదుల్లోకి నీరు వచ్చేస్తోంది. బాత్‌రూంలు, టాయిలెట్లలో పైకప్పులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు మెనూ కూడా తమకు సక్రమంగా అందించడం లేదని విద్యార్థులు వాపోయారు. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేవారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించే వారు. కానీ గడ నాలుగు రోజులుగా హాస్టల్ వార్డెన్ పీఎస్‌ఎన్ మూర్తి సెలవులో వెళ్లిపోయారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్ వార్డెన్‌గా వచ్చిన వ్యక్తి కూడా హాస్టల్‌లో జెండా వందనం జరిపేందుకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో విద్యార్థులు బుధవారం ఉదయం హాస్టల్‌లో తలుపులు మూసేసుకుని నిరసన తెలియచేశారు. ఇన్‌చార్జ్ వార్డెన్ గంగునాయుడు వచ్చి విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఉదయం అల్పాహారం తీసుకోలేదని వారు చెప్పారు. ప్రభుత్వ హాస్టల్‌లో పతాకావిష్కరణ చేయని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.