ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ హయాంలోనే అక్రమ మైనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 16: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అక్రమ మైనింగ్ జరిగిందని, ప్రస్తుతం మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయని వైకాపా నేతలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011 సంవత్సరంలో పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామనివాసి అన్నపురెడ్డి హనిమిరెడ్డి పిడుగురాళ్ల, కొండమోడు గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి లేఖలు రాసి కోర్టులను కూడా ఆశ్రయించారన్నారు. అప్పటి ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు అప్పటి సీఎం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. వైకాపా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, సరస్వతీ భూముల వ్యవహారంలో మాచవరం, చెన్నయ్యపాలెం గ్రామాల రైతులపై ఆటవికంగా దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేశారని అప్పుడు రైతుల పక్షాన తాము నిలబడటంతో కక్షసాధింపు చర్యగా నేడు అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారన్నారు. వోక్స్‌వ్యాగన్ కుంభకోణంలో చిక్కుకున్న బొత్స సత్యనారాయణ, అమ్మాయిలకు ఎరవేసే అంబటి రాంబాబు చరిత్ర హీనులని, వీరు అవినీతిలో కూరుకుపోయి, ఎదుటివారిపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారన్నారు.
వైకాపా నేతల సంగతి ప్రజాక్షేత్రంలో తేలుస్తామని, ఈ న్యాయపోరాటంలో ప్రజలు వారిని దోషులుగా తేలుస్తారని యరపతినేని మండిపడ్డారు.