ఆంధ్రప్రదేశ్‌

45 నిమిషాల్లో ముగిసిన జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాతవరం, ఆగస్టు 16: విశాఖ జిల్లా నాతవరం మండలం డి.యర్రవరం నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర 238 రోజుకు చేరింది . ఇప్పటి వరకు 2,741 కిలో మీటర్లు జగన్ పాదయాత్ర చేసారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర కేవలం 45 నిమిషాల్లోనే ముగించారు. యర్రవరం నుండి ములగపూడి వరకు ఒకటిన్నర కిలో మీటర్లు పాదయాత్ర చేసి ముగించారు. 10 గంటలకు శిబిరం వద్ద నుండి హైదరాబాద్ వెళ్ళేందుకు వాహనంలో రాజమండ్రి విమానాశ్రయానికి తరలివెళ్ళారు. అంతకు ముందు సెల్ఫీలు, పలకరింపులతో జగన్ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ యాత్రలో మహిళలు పువ్వులు, కాలిబాటకు చీరలు వేస్తూ , హారతులు పడుతూ స్వాగతం పలికారు. అప్యాయత, అనురాగంతో మహిళల వద్దకు వెళ్ళి చిన్నారులను ముద్దాడుతూ, అందరినీ అప్యాయంగా పలకరించారు. జై జగన్ అంటూ మహిళలు ఉత్సాహంగా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. మార్గ మధ్యలో ములగపూడి గ్రామానికి చెందిన వల్లు మహాలక్ష్మి(70) , దక్కా కళ్యాణం (వితంతు) పెన్షన్లు ఇవ్వలేదంటూ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేసారు. మీ సమస్యలు పరిష్కరించేందుకే నేను వచ్చానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సంకల్ప యాత్రలో వైసీపీ జిల్లా నాయకులు వరుధు కళ్యాణి, పెట్ల ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ, డీవీ సూర్యనారాయణరాజు, వైసీపీ మండల సీనియర్ నాయకులు అంకంరెడ్డి జమీలు, చెర్లోపాలెం మాజీ సర్పంచ్ రమణ, పైల పోతురాజు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.