ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదాకోసం యూత్ కాంగ్రెస్ ‘బస్సు యాత్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం యువజన కాంగ్రెస్ బస్సుయాత్ర నిర్వహించనుందని అఖిలభారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి, ఏపీ ఇన్‌ఛార్జి ఊట్ల వరప్రసాద్ పేర్కొన్నారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో అవసరమైతే ఆమరణ దీక్షలకు దిగుతామని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారధ్యంలో ఈ బస్సుయాత్ర అనంతపురం నుంచి ఉత్తరాంధ్రా వరకు సాగుతుందన్నారు. ప్రతీ జిల్లాలోను రెండు రోజుల పాటు ర్యాలీలు, రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ చేసిన మోసాలను వివరిస్తామన్నారు. ఈ సభలు, సమావేశాల్లో ఏఐసీసీ, ఐవైసీ, పీసీసీ నుంచి వివిధ హోదాల్లో ఉన్నవారు పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను యువజన కాంగ్రెస్ పార్టీ 21 జిల్లాలుగా మార్పుచేసుకుని పనిచేస్తుందన్నారు. ఈ 21 జిల్లాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటుచేసుకునే ప్రక్రియను ఈ నెల 25వ తేదీతో ముగిస్తామన్నారు. అదే విధంగా రానున్న 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 42 వేల బూత్ కమిటీలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సమయంలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించామని, ఆయన సారధ్యంలో బస్సు యాత్రను ముగించుకుని యువజన కాంగ్రెస్ పార్టీ జలదీక్షలు, కలెక్టరేట్‌ల వద్ద రిలే దీక్షలు తదితర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాఫెల్ కుంభకోణంపై యువజన కాంగ్రెస్ ముద్రించిన పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నరసాపురం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంకెం సీతారాం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.