ఆంధ్రప్రదేశ్‌

రోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: రోగుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. వెలగపూడి సచివాలయంలో రోగి భద్రత అన్న అంశంపై గురువారం సదస్సు నిర్వహించారు. వైద్య రంగానికి చెందిన పలువురు వైద్య ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ రోగి ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి తిరిగి క్షేమంగా ఇంటికి పంపించేంత వరకూ చేయాల్సిన పనుల చెక్‌లిస్టు సూపరింటెండెంట్‌ల వద్ద, డాక్టర్ల వద్ద తప్పనిసరిగా ఉండాలన్నారు. రోగి పేరు, వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, మందుల వాడకం, తిరిగి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కుటుంబ సభ్యులకు చెప్పడం వంటివి చెక్‌లిస్టులో ఉండాలన్నారు. ఆసుపత్రి నిర్వహణ, పారిశుద్ధ్యం, అగ్ని ప్రమాదాల నుంచి భద్రతలో జాగ్రత్త వహించాలన్నారు. ఏడాది అంతా ఎంత బాగా విధులు నిర్వహించినా, ఒక్కచోట చిన్న పొరపాటు వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రజారోగ్యానికి ఎంత డబ్బు ఖర్చయినా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైద్య విద్యార్థులు, అంగన్‌వాడీ కార్యకర్తలు తరచూ గ్రామాలకు వెళ్లి ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. రోగి భద్రతా చర్యల్లో భాగంగా ఏపీ ఈఆర్‌ఎక్స్ యాప్‌ను సీఎం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా యాంటిబయాటిక్స్, టీబీ మందుల వాడకాన్ని నియంత్రించనున్నట్లు తెలిపారు. దీనిని డాక్టర్లు ఉపయోగించేందుకు మూడు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. రోగి పేరు, సెల్ నెంబర్, వ్యాధి, మందుల పేర్లు, మోతాదు, ఎంత కాలం వాడాలి తదితర వివరాలతో యాప్‌లో డాక్టర్ నమోదు చేయాలన్నారు. వారికి ఒక కోడ్ ఇస్తారని, ఆ కోడ్ ద్వారా రాష్ట్రంలో ఏ ఫార్మసిస్టు దగ్గరైన మందులు కొనుగోలు చేయవచ్చన్నారు. డాక్టర్ మందులు రాసిన వెంటనే సెల్‌కు మెసేజ్ వెళ్తుందన్నారు. దేశంలో ఏడీ (ఆటో డిజెబుల్) సిరంజి ద్వారా ఒక ఇంజక్షన్.. ఒక సిరంజి విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై హెచ్‌ఎండీ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టు వైద్యుడు హరీంద్ర సింగ్ రత్తీ ప్రశంసించారు. ఆసుపత్రుల్లో రోగులకు సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై సదస్సులో చర్చించారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ డైరెక్టర్ గాయత్రి, ఎపీ మెడిటెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, యునిసెఫ్ ప్రతినిధి సంజయ్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.