ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడి ప్రతిష్ట నిలబెడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) ఆగస్టు 17: రాను న్న దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నుండి నిధులను తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని విజయవాడ దుర్గగుడి ఈవో వీ కోటేశ్వరమ్మ వెల్లడించారు. ఈవోగా ఆమె శుక్రవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడు తూ దసరా మహోత్సవాలను సిబ్బందితోపాటు, ధర్మకర్తల మండలి సూచనలు, సలహాలు తీసుకుని విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. గతం లో అమ్మవారి సన్నిధిలో జరిగిన కొన్ని దురదృష్టకరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లో అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. దుర్గగుడి ప్రతిష్టను నిలబెడతానన్నారు. దసరాను రాష్ట్ర పండుగ్గా రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించిన నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. భక్తులతో నేరుగా మాట్లాడేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని వారి సూచనలు, సలహాలు సైతం పరిగణనలోనికి తీసుకునే అంశా న్ని పరిశీలిస్తున్నానని తెలిపారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్టు ఆమె వివరించారు. కాగా, ఆమె తొలుత మల్లేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని, తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని అర్చకుల దివ్య అశీస్సులను అందుకున్నారు. అనంతరం ఈవోగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.