తెలంగాణ

ఆర్టీసీపై ప్రభుత్వ పన్నుల భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: ఆర్టీసిపై అధికంగా భారం పడడానికి కారణం ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులేనని టిఎస్‌ఆర్టీసి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసి) స్పష్టం చేసింది. ఆర్టీసి బస్‌లు సగటున రోజుకి 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయని తెలిపింది. అన్ని రకాల పన్నులు కలిపి కిలోమీటర్‌కు రూ.5 చొప్పున అంటే రోజుకు రూ.1.80 కోట్లు పన్నుల రూపేణా ఆర్టీసి చెల్లిస్తోందని తెలిపింది. జెఎసి సమావేశం సోమవారం నాడిక్కడ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానంతరం జెఏసి కన్వీనర్ రాజిరెడ్డి, ఇతర సంఘాల ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రూ.3600 కోట్లు సొమ్ము ఆర్టీసికి ఇచ్చినట్లు చెబుతోందని, ఆ మొత్తం ఏం చేశారనేది యాజమాన్యమే సమాధానం చెప్పాలని తెలిపారు. రాయితీల కింద ఆర్టీసికి చెల్లించాల్సిన మొత్తం కింద విడతల వారీగా విడుదల చేసిన మొత్తం తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదని అన్నారు. ప్రభుత్వ హామీతో రూ.470 కోట్లు రుణం ఇప్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, ఒక్క పైసా రాలేదని వారు వివరించారు. ప్రభుత్వ అనుచిత వ్యాఖ్యలపై నిలదీయాల్సిన బాధ్యత కార్మిక సంఘంపై ఉందని అన్నారు. గుర్తింపు సంఘం ఐక్య పోరాటానికి నాయకత్వం వహించాలని, తాము సంపూర్ణమద్దతు ఇస్తామని వెల్లడించారు.