తెలంగాణ

డిగ్రీలో తొలగించిన కోర్సులు చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో తొలగించిన కోర్సులు అన్నింటినీ చేర్చాలని తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ కోరింది. కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కే చక్రధరరావు, నిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ, ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ జి హరగోపాల్ తదితరులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డిని కోరారు. కొన్ని దశాబ్దాలుగా డిగ్రీ కాలేజీల్లో కొనసాగిన కోర్సులను అకస్మాత్తుగా విరమించుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు. గతంలో ఉన్న కోర్సులు ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లలో కనిపించడం లేదని, విద్యార్ధులు లేరనే సాకుతో కోర్సులను తొలగించడం సరికాదని అన్నారు. మాస్ కమ్యూనికేషన్, జాగ్రఫీ, హ్యుమన్ రైట్స్ తదితర కోర్సులను ప్రభుత్వ కాలేజీల్లో తొలగించి, అవే కోర్సులను ప్రైవేటు కాలేజీల్లో అనుమతించడం చూస్తుంటే ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానం అర్ధమవుతోందని అన్నారు.
ఇప్పటికైనా తొలగించిన కోర్సులను చేర్చాలని వారు కోరారు. కమిటీ తరఫున మండలి చైర్మన్‌ను కోరిన వారిలో పివైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె ఎస్ ప్రదీప్, డాక్టర్ భగవంత్‌రెడ్డి, పిడిఎస్‌యు ప్రధానకార్యదర్శి బొయన్‌పల్లి రాము తదితరులున్నారు.
స్కూల్ ఫీజులపై జీవో ఇవ్వాలి
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నిర్ధారిస్తూ వెంటనే జీవో ఇవ్వాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య కోరా రు. ఇందుకోసం జీవో 42/2010పై ఉన్న హైకోర్టు స్టే ఉత్తర్వులను ఉపసంహరింపచేసేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు. ప్రైవేటు స్కూళ్లలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే వినియోగించాలని, ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారంలను మార్కెట్ రేట్లకే అమ్మించాలని అన్నారు. పేద కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లతో సహా విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలని కోరారు.