తెలంగాణ

ధాన్యం కొనుగోలులో నల్లగొండ టాప్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 21: యాసంగి ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం ముందెన్నడు లేని రీతిలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తం గా 38లక్షల 49,843మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా సోమవారం నాటికి 28లక్ష ల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశా రు. మరో నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు తెరదించేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించుకుని కొనుగోలు వేగం పెంచింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 220కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ సీజన్‌లో 4లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటిదాకా 4లక్షల 23,568టన్నులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం 30కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు సాగుతుంది. రెండో స్థానంలో నిజామాబాద్ జిల్లా 2లక్షల 97వేల టన్నులు కొనుగోలు చేశారు. మూడో స్థానంలో జగిత్యాల 2లక్షల 31వేల టన్నులు కొనుగోలు చేశారు. సూర్యాపేట జిల్లాలో 2లక్షల 57వేల టన్నులకు 1లక్ష 45వేల టన్నులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2లక్షల 10వేల టన్నులకు 1లక్ష 73వేల టన్నులు కొనుగోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,279 కోట్ల మేరకు ధాన్యం కొనుగోలు చేయగా వాటిలో 2,100కోట్ల మేరకు చెల్లింపులు పూర్తి చేయగా మిగతా డబ్బుల కోసం రైతులు అధికార యంత్రాంగం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటిదాకా 673కోట్ల 47లక్షల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో సోమవారం నాటికి 392కోట్ల 68లక్షలు చెల్లింపులు పూర్తి చేశారు. రైతుబంధు పథకం నేపధ్యంలో బ్యాంకర్లు నగదు నిల్వల సమస్యలతో ధాన్యం డబ్బుల చెల్లింపును పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి రుణ మొత్తంలో మరో 2వేల కోట్లు సమీకరించుకుని చెల్లింపుల ప్రక్రియకు కసరత్తు చేస్తున్నట్లుగా పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. కేంద్రం అందించే రుణ మొత్తం మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంకు అందుతాయని వెంటనే రైతులకు చెల్లింపులు కొనసాగుతాయని చెబుతున్నారు. గత ఏడాది యాసంగి సీజన్‌లో 23లక్షల 83,425టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
ప్రారంభమైన కస్టమ్ మిల్లింగ్
యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపుకు చేరుకోవడంతో సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ కోసం అప్పగించి బియ్యం సేకరణ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18లక్షల 21వేల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 2లక్షల టన్నుల మేరకు బియ్యం ప్రభుత్వానికి చేరింది.
కస్టమ్ మిల్లిం గ్ బియ్యం సేకరణ వేగవంతం చేసి పిడిఎస్ బియ్యం పంపిణీతో పాటు హాస్టల్స్, పాఠశాలలు, అంగన్‌వాడీలకు బియ్యం కొరత లేకుండా చూసేందుకు పౌరసరఫరాల సంస్థ కసరత్తు ముమ్మరం చేస్తుంది.