తెలంగాణ

కాలంతో ‘కాళేశ్వరం’ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూన్ 13: కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు సాగుతూ త్వరలో 38 లక్షల ఎకరాలకు మూడు పంటల నీరందించబోతున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. బుధవారం సిరిసిల్ల మండలం సర్దాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఇక్కడ రూ.30 కోట్లతో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల భవనంకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో సిరిసిల్ల నియోజకవర్గ నాల్గవ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కె.తారకరామారావు ప్రసంగిస్తూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. వాయువేగంతో నిర్మాణం సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలను దారిలో సిద్దిపేట వద్ద చూశామని, త్వరలో 11 వేల క్యూసెక్కులకు నీరందించే ఈ కాలువల నిర్మాణం అద్భుతమని పేర్కొన్నారు. భూప్రక్షాళనలో రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా రైతుల బీమాలో అన్ని జిల్లాల కంటే ఫారాలు పూర్తిచేయించి రాష్ట్రంలోనే ముందుండాలని, ఇందు కోసం గ్రామ రైతు సమన్వయ సమితిలు చొరవ చూపి, అధికారులతో ప్రక్రియను వేగవంతం చేయించాలని కోరారు. నీళ్ళు, నిధులు, నియామకాలు కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లక్ష్య సాధనలో దూసుకెళ్తోందని అన్నారు. 38 లక్షల ఎకరాలకు, మూడు పంటలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో రికార్డులో నిలుస్తుందన్నారు. కన్నీళ్ళు చూసిన సిరిసిల్ల ప్రాంతం ఇపుడు నీటి కళ సంతరించుకుందని, రూ.30 కోట్లతో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ కళాశాలతో వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతుందని, తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి వ్యాఖ్యలు నిజం కానున్నాయని కేటీఆర్ అన్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం ద్వారా వ్యవసాయానికి మెరుగైన సేవలు, రాబోయే ఆరు నెలల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు నీరు అందించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. పంటకు బీమా, మద్దతు ధరలు కేంద్రం పరిధిలో ఉన్నా, రాష్ట్ర ముఖ్య మంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. రైతుబీమా కార్యక్రమాన్ని జూలై 10లోగా పూర్తి చేయడానికి ఎల్‌ఐసీ, రైతు సమన్వయ సమితిలు, వ్యవసాయ అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని, రికార్డు స్థాయిలో మూడున్నర ఏళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్టు వాయు వేగంతో పనులు చేసి పూర్తి చేసుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డు బద్దలు కొడుతున్నామని, 1200 టీఎంసీల గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.