తెలంగాణ

నేటి నుంచి సీపీఎం మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: నగరం ఎర్రభారింది..., ఎటుచూసినా ఎర్ర తోరణాలు, జెం డాలు రెపరెపలాడుతున్నాయి. సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు బుధవా రం నుం చి ప్రారంభం కానున్నాయి. సామాజిక న్యా యం, మతోన్మాద శక్తులను గద్దె దించడం వంటి ప్రధాన అజెండాలతో ఈ కీలక సమావేశాలు జరగనున్నాయి. 21వరకు ఆర్టీసీ కల్యాణ మండపంలో మహాసభలు కొనసాగుతాయి. 22న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ తో సమావేశాలు ముగుస్తాయి. ప్రధాన వేది క ఆర్టీసీ కల్యాణ మండపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. మహాసభలకు 16మంది పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సీపీఎం పార్టీ అ గ్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నా రు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలు, మత పేరుతో దళిత, బహుజనులపై జరుగుతు న్న దాడులు, నిరుద్యోగ సమ స్య వంటి 30 అంశాలపై సమగ్రంగా చర్చించి తీర్మానాల ను వెల్లడించనున్నారు. వేలాదిగా తరలివస్తున్న వారికోసం ప్రత్యేక భోజన, వసతి సౌ కర్యాలను ఏర్పాటు చేశారు. 1500 మంది వలంటీర్లు ఈ సభను విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నారు. సభలు జరుగుతున్న ఆర్టీసీ కల్యా ణ మండపంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ను సిద్ధం చేశారు. సభల ప్రసారాల కోసం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
జెండా ఆవిష్కరణతో ప్రారంభం
బుధవారం ఉదయం 10 గంటలకు పార్టీ సీనియర్ నాయకురాలు మల్లు స్వ రాజ్యం జెండా ఆవిష్కరణతో మహాసభలు ప్రారం భం కానున్నాయి. అనంతరం జరిగే సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభోపన్యాసం చే యనున్నారు. జాతీయ, అంతర్జాతీయ అం శాలపై ఈ స మావేశాల్లో విస్తృతంగా చర్చిం చి, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ పై అగ్ర నాయకత్వం చర్చించి పార్టీ కా ర్యకర్తలకు దిశానిర్థేశం చేయనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన తమ్మినేని
మహాసభల ముగింపు సందర్భంగా ఈ నెల 22న భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సరూర్‌నగర్ స్టేడియంలో జరుగుతు న్న ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం మంగళవారం పరిశీలించా రు. ఎలాంటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.