తెలంగాణ

యుఎస్ కాన్సులేట్ ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించడంతో సోమవారం నాడు బేగంపేటలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వీహెచ్‌పీ , భజరంగ్‌దళ్ కార్యకర్తలు ముట్టడించనున్నట్టు సమాచారం అందడంతో వందలాది మంది పోలీసులతో పహరా ఏర్పాటు చేశారు. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌తో పాటు మరికొన్ని సంస్థలను తీవ్రవాద సంస్థలుగా అభివర్ణించింది. ఆరెస్సెస్‌ను రాజకీయ ఒత్తిడి బృందంగా వర్గీకరించడంపై వీహెచ్‌పీ కార్యకర్తలు మండిపడ్డారు. రాజకీయాల్లో ఉంటూ రాజకీయ పరమైన ఒత్తిడి కలిగిస్తూ ఎన్నికల్లో పోటీ చేయని సంస్థలను రాజకీయ ఒత్తిడి బృందాలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నేతలు ఆందోళన చేపట్టారు. ముందస్తుగా నగరంలోని పలువురు భజరంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేట అమెరికా కాన్సులేట్ పరిసర ప్రాంతాల్లో నేతల ధర్నాతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కొంత మంది నేతలు కాన్సులేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు 50 మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ అధ్యక్షుడు రామరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్‌రెడ్డి, భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌చందర్, సిటీ కన్వీనర్ చైతన్య తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. భారత్‌మాతాకు జై అంటూ నినాదాలు చేశారు.