తెలంగాణ

జనచైతన్య యాత్ర తేదీలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జన చైతన్య యాత్ర మార్గం ఖరారైంది. ఈ యాత్ర 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరిలో మొదలవుతుంది. భువనగిరి సభ అనంతరం నాయకులు అక్కడే బస చేస్తారు. 24వ తేదీ ఉదయం 11 గంటలకు నల్లగొండ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు మనుగోడులో సభలు జరుగుతాయి. రాత్రికి మనుగోడులో బస చేస్తారు. 25వ తేదీన సోమవారం నాడు ఇబ్రహీంపట్నం, కందుకూరు సభల్లో పాల్గొని కడ్తాల్‌లో బస చేస్తారు. 26వ తేదీన అచ్చంపేట, వనపర్తి సభల్లో పాల్గొని కొత్తకోటలో బస చేస్తారు. 27వ తేదీ దేవరకద్ర, నారాయణ పేటల్లో సభల్లో పాల్గొని మహబూబ్‌నగర్‌లో బస చేస్తారు. 28వ తేదీ షాద్‌నగర్, పటాన్‌చెర్వుల్లో సభల్లో పాల్గొని పటాన్‌చెర్వులో బస చేస్తారు. 29వ తేదీన మెడ్చెల్, సిద్ధిపేటల్లో పాల్గొని 30న దుబ్బాక, కామారెడ్డి సభల్లో పాల్గొంటారు. జూలై 1న జుక్కల్, ఆర్మూర్‌ల్లో, 2వ తేదీన జగిత్యాల ధర్మపురిల్లో పాల్గొని మంచిర్యాలలో బస చేస్తారు. 3వ తేదీన మంచిర్యాల , పెద్దపల్లి సభల్లో పాల్గొంటారు. 4న కరీంనగర్, భూపాలపల్లి , 5వ తేదీన పరకాల , హన్మకొండ, 6వ తేదీన తుంగతుర్తి సభల్లో పాల్గొంటారు. నాలుగేళ్ల పాలనలో ఒకేమారు కేంద్రంలో బీజేపీ పాలన, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనలో పొంతన చూడాల్సిందిగా నేతలు ప్రజలను కోరనున్నారు. నాలుగేళ్ల పాలనలో ధనిక రాష్ట్రం కాస్తా, ఈ రోజు అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని, జవాబుదారీతనం లేని పాలన, ప్రజాకర్షణ కోసం తీసుకున్న నిర్ణయాలు, రాజ్యాంగ ఉల్లంఘన తదితర అంశాలు అన్నీ ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు వేరని, నాలుగేళ్ల పాలనలో జరుగుతున్న పాలనతో ప్రజల ఆశలు అడియాశలయ్యాయని అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ, ఉపాధి, దళిత, గిరిజనుల అభివృద్ధి, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం, మూడు ఎకరాల భూమి పంపిణీ వంటి అంశాలు అన్నీ పక్కకు వెళ్లిపోయాయని, కుటుంబ పాలనకు అత్యధిక ప్రాధాన్యత వచ్చిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయితీల నుండి హైదరాబాద్ వరకూ అడుగడుగునా అవినీతి చీడ పట్టుకుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ , ప్రజల్లో కుల, మత విద్వేషాలు సృష్టిస్తూ టీఆర్‌ఎస్ పాలన సాగుతోందని పేర్కొన్నారు.