తెలంగాణ

చేరింది 38,705 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జూలై 6 నుండి రెండో విడత ఇంజనీరింగ్ కౌనె్సలింగ్
హైదరాబాద్, జూన్ 19: తొలి విడత ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌనె్సలింగ్‌లో 52,621 మందికి సీట్లు కేటాయించగా అందులో 38,705 మంది రిపోర్టు చేశారు. ఇంజనీరింగ్‌లో 64,946 సీట్లు ఉండటంతో మిగిలిన సీట్లకు వచ్చే నెల 6వ తేదీ నుండి రెండో దశ కౌనె్సలింగ్ నిర్వహిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ జూలై 2న ఇవ్వనున్నారు. జూలై 6 నుండి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రెండు రోజులు గడువిస్తారు. 7,8 తేదీల్లో సర్ట్ఫికేట్ల పరిశీలన చేస్తారు. 7వ తేదీ నుండి 10వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. జూలై 12వ తేదీన వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన వారు జూలై 12 నుండి 14వ తేదీలోగా ట్యూషన్ ఫీజు చెల్లించాలి. 13వ తేదీ నుండి 15వ తేదీ వరకూ ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలి. 16వ తేదీ నుండి క్లాసులు జరుగుతాయి. ఐసెట్ కౌనె్సలింగ్ ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు 4వ తేదీ వరకూ గడువు ఉంటుంది. సర్ట్ఫికేట్ల పరిశీలన 2వ తేదీ నుండి 4వ తేదీ వరకూ జరుగుతుంది. వెబ్ ఆప్షన్లను జూలై 2 నుండి 5వ తేదీ వరకూ నమోదు చేయవచ్చు. సీట్ల కేటాయింపు జూలై 7న జరుగుతుంది. ట్యూషన్ ఫీజు చెల్లింపు జూలై 12లోగా జరగాలి. ఆయా కాలేజీల్లో 12న రిపోర్టు చేయాలి. జూలై 16 నుండి క్లాసులు మొదలవుతాయి. ఈ నెల 24వ తేదీ నుండి ఇసెట్ అడ్మిషన్ల కౌనె్సలింగ్ జరగనుంది. 26వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్‌కు గడువు ఉంటుంది. 27 వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలన చేస్తారు. 25 నుండి 28 వరకూ వెబ్ ఆప్షన్లు గడువు ఉంటుంది. 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. 30 వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకూ ట్యూషన్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ఏ ర్యాంకు నుండి ఏ ర్యాంకు వరకూ ఏ కేంద్రంలో హాజరుకావాలనే దానిపై సమగ్రమైన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. టిఎస్‌ఇసెట్ డాట్ నిక్ డాట్ ఇన్ అనే వెబ్‌పోర్టల్‌ను సందర్శించాలని అడ్మిషన్స్ కన్వీనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.
గురుకులాల్లో నీట్ లాంగ్‌టెర్మ్
సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో ‘నీట్’కు లాంగ్‌టెర్మ్ శిక్షణ కోరుకునే విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నీట్‌లో 250 మార్కులు వచ్చిన వారు లాంగ్‌టెర్మ్‌కు దరఖాస్తు చేయవచ్చని అన్నారు. ఇతర వివరాలకు టిఎస్‌డబ్ల్యుఆర్‌ఐఎస్ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్ సందర్శించాలని సూచించారు.