తెలంగాణ

జూలై 15నుంచి బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: రాష్ట్ర పండుగగా బోనాల జాతరను ప్రకటించడంతో జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు రాష్టవ్య్రాప్తంగా అంగరంగ వైభవంగా బోనాలను నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఏర్పాట్లపై మంగళవారం తలసాని అధికారులుతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం బోనాల పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జూలై 15వ తేదీన గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం అయి ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. రాష్టర్రాజధానిలోని గొల్కొండ, ఉజ్జయిని మహంకాలి దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాల్లో జరిగే వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. గొల్కొండ, ఉజ్జయిని వేడుకలకు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందకు తగ్గుట్టుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలన్ని సమన్వయంతో పని చేసి వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ఈనెల 30న బోనాల ఏర్పాట్లపై మరోమారు సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. వేడుకలు జరిగే దేవాలయాల వద్ద ఒక్క రోజు ముందే ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల వద్ద ట్రాఫిక్ , శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. భారీకేడ్లను ఏర్పాటు చేసి భక్తులు ఎలాంటి తోపులాటలకు గురికాకుండా క్రమ పద్దతిలో ఆలయాలలోనికి ప్రవేశించి తిరిగి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పదవీకాలం ముగిసిన ఆలయ కమిటీలకు నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరినట్టు తెలిపారు.