తెలంగాణ

లక్షా 21వేల మందితో మెగా యోగా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైనరాబాద్, జూన్ 20: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం సింగరేణి యాజమాన్యం లక్షా 21వేల మందితో మెగా యోగాడే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమేరకు యాజమాన్యం సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మిక కుటుంబాలు పాల్గొనేలా అందరికీ వర్తమానం పంపింది. సింగరేణిలో విస్తరించిన 11 పట్టణాల్లో గనులు,స్టేడియంలు, పాఠశాలలు, కళాశాలల్లో పెద్ద ఎత్తున నిర్వహణకు సమాయత్తం అవుతోంది. గనుల్లో పని చేస్తున్న 53 వేల కార్మికులు యోగాడే గురించి విస్తత్ర ప్రచారం చేయాలని సంస్థ సూచించింది. మెగా యోగా ప్రదర్శనకు సంబంధించిన విషయాలను సీనియర్ డైరెక్టర్లు ఎస్ శంకర్, వి. భాస్కర్‌రావు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గతంలో నిర్వహించిన యోగాడే సందర్భంగా 60 వేల మంది పాల్గొన్నారని, ఈ యేడాది లక్షా 21వేల మందితో యోగాడే కార్యక్రమం నిర్వహంచాలని వారు సూచించారు. గత ఐదు రోజులుగా యోగాడే కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. గురువారం నాడు సాయంత్రం భారీగా మెగా యోగాడే నిర్వహించడానికి కార్మికులు 3 షిప్టుల్లో పాల్గొనడానికి వీలుగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 2016 సంవత్సరంలో యోగాడే సందర్భంగ సింగరేణి వ్యాప్తంగా 64 వేల మంది పాల్గొన్న అంశాన్ని ఒక సంస్థ నిర్వహించిన అతిపెద్ద యోగా ఈవెంట్‌గా నేషనల్ లిమ్కా రికార్డ్సుతో గుర్తింపు పొందిందని నేడు జరగబోవు యోగాడే అంతకుమించిన రెట్టింపుతో విజయవంతం చేయడానికి సింగరేణి యావత్ సిబ్బంది సమాయత్తం కావాలని సంస్థ సిఎండి శ్రీ్ధర్ పిలుపు ఇచ్చారు.
నేడు గచ్చిబౌలిలో ..
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం గచ్చిబౌలిలో అంతర్జాతీయ యోగాడే నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఈ యోగాడే ఆయూష్ నేత్రుత్వంలో జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్ర మంత్రి మాన్‌షుక్ లక్ష్మన్ మాంధవ్వ పాల్గొంటున్నారు. 2015 జూన్ 21 మొదటి అంతర్జాతీయ యోగాడే నిర్వహించారని,ఐక్యరాజ్య సమితి కూడా యోగాను ప్రోత్సహిస్తోంది. వందల ఏళ్ళ క్రితమే భారత దేశంలో ప్రాచుర్యంలో ఉండేదని తర్వాత కాలంలో పాశ్చాత్య దేశాలు యోగాను ఎక్కువగా పాటిస్తున్నాయి. జీవనశైలిలో వచ్చిన మార్పులు,దీర్ఘకాలికై నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌కి కారణమవుతున్నాయి. 2015 నుంచి ఎంపిక చేసిన 27 గ్రామాలతో పాటు ఈ యేడాది ఏర్పడిన జిల్లాల్లో యోగాడే ఏర్పాట్లు పూర్తి చేశారు.