తెలంగాణ

వెనక్కి తగ్గేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని రేషన్ డీలర్లు తెగేసి చెప్పేసారు. ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం స్పష్టం చేసింది. వచ్చే నెల జూలై నుంచి రేషన్ షాపులు బంద్ పెడుతామని రేషన్ డీలర్లు సమ్మె నోటిసు ఇవ్వడంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి డీలర్లను పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ చర్చలకు ఆహ్వానించారు. ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. రేషన్ డీలర్లకు వేతనం, పాత బకాయిల చెల్లింపు తదితర ప్రధానమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మెను కొనసాగించాలని డీలర్ల సంఘం నిర్ణయించింది.
వచ్చే నెలకు సంబంధించిన సరుకుల కోసం చెల్లించే డిడీలకు గడువు ముగిసినప్పటికీ డీలర్లు ఏకత్రాటిపై నిలబడి ఓక్క డీడీ కట్టకపోవడాన్ని రాష్ట్ర సంఘం అభినందించింది. ఇదే స్ఫూర్తిని డిమాండ్లను సాధించుకునే వరకు కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం రావడంతో భవిష్యిత్ కార్యాచరణపై డీలర్ల రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సమావేశమైంది. అనంతరం తమ వైఖరిని వారు మీడియాకు వెల్లడించారు. గత నవంబర్‌లో సమ్మెకు దిగినప్పుడు కూడా ప్రభుత్వం ఇలాగే డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి విరమింప చేసిందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు గుర్తు చేసారు. తాము మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగులకు, ఆర్టీసి కార్మికులకు, హమాలీలకు వేతనాలు పెంచి తమను మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. రేషన్ డీలర్ల సత్తా ప్రభుత్వానికి చూపిస్తామని రాష్ట్ర సంఘం హెచ్చరించింది.
ఇలా ఉండగా రేషన్ డీలర్లు, హమాలీలు జూలై నుంచి సమ్మెకు నోటిసు ఇచ్చిన విషయం తెలిసిందే. డీలర్లకు హమాలీల సంఘం సంఘీభావం పలకడంతో వచ్చేనెలలో రేషన్ షాపులు మూతపడే ప్రమాదం తలెత్తడంతో పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే స్పందించి హమాలీలతో చర్చించి సమ్మె విరమింపచేసింది. డీలర్ల డిమాండ్ల పట్ల కాస్త కటువుగానే ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. డీలర్లు సమ్మె విరమించకపోతే మహిళా పొదుపు సంఘాలతో రేషన్ షాపులు నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టిసారించినట్టు అధికార వర్గాల సమాచారం. ఈ సమాచారంతో డీలర్ల సంఘం ప్రభుత్వంతో తాడోపెడో తేల్చుకునే దాకా వెనక్కి తగ్గవద్దని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న డీలర్లతో జరిపే చర్చలు కీలకంగా మారాయి.