తెలంగాణ

కేంద్రం వద్దకు విద్యుత్ వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణ కోసం 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ వద్ద పంచాయితీకి తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల విద్యుత్ డిస్కంలు సిద్ధం అవుతున్నాయి. చర్చలు విఫలం అయితే మాత్రం ఇరు రాష్ట్రాల ట్రాన్సుకో సంస్థలు నష్టపోతాయని తెలంగాణ విద్యుత్ డిస్కంలు అధికారులు అంటున్నారు. ఒప్పందాల ప్రకారం విద్యుత్‌ను తెలంగాణ డిస్కంలు కొనాల్సిందేనని చతీస్‌గఢ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఆల్టిమేటం ఇస్తున్నాయి. పెంచిన భారాన్ని తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై వేయలేమని తెలంగాణ డిస్కంలు చతీస్‌గఢ్ విద్యుత్ డిస్కంలకు తేల్చిచెబుతున్నాయి. తాము గతంలో ఒక మెగావాట్ ధర 6.32 కోట్లుకు కోట్ చేశామని, ప్రస్తుతం ఒక మెగావాట్ ధర రూ 7 కోట్లకు మించి మేము భరించలేమని తెలంగాణ డిస్కంలు స్పష్టం చేశాయి. అయితే చతీస్‌గఢ్ విద్యుత్ ట్రాన్సుకో మాత్రం ఒక మెగావాట్ ధర 9.20 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. మార్వా విద్యుత్ థర్మల్ ప్లాంట్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని, పెరిగిన వ్యయాన్ని తెలంగాణ డిస్కంలు భరించాలని చతీస్‌గఢ్ ట్రాన్సుకో వాధిస్తోంది. దీంతో ఇరువురు మధ్య లొల్లి మొదలైయ్యింది.ఎవరి వాదన వారికి సరైనేదని వాధించుకుంటున్నాయి. చతీస్‌గఢ్ రాష్ట్రం మార్వా వద్ద 1000 మెగావాట్ల విద్యుత్ థర్మల్ ప్లాంట్‌ను ఆ రాష్ట్ర ట్రాన్సుకో చేపట్టింది. ఈ ప్లాంట్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని చతీస్‌గఢ్ ట్రాన్సుకో వాదిస్తోంది. దీన్ని తెలంగాణ ట్రాన్సుకో తోసిపుచ్చుతోంది. నిర్మాణ ఖర్చులతో మాకేం సంబంధం అటూ తెలంగాణ ట్రాన్సుకో తెగేసి చెప్పింది. వాదనలతో కాలయాపన ఎందుకు అంటూ ఇరు రాష్ట్రాల ట్రాన్సుకో అధికారులు చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇరువురు ఒక తేదీన చర్చలకు సిద్ధమని పరస్పరం అవగాహనకు వచ్చారు.
తెలంగాణకు కావాల్సిన 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై ముఖ్యమంత్రి కేసేఆర్‌తో సమావేశం అనంతరం ఒక నిర్ణయానికి వస్తామని ట్రాన్సుకో అధికారులు చెబుతున్నారు. చర్చల్లో ప్రతిష్టంబన వస్తే ఇక కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ వద్ద పంచాయితీ పెట్టాలని తెలంగాణ విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పరోక్షంగా చతీస్‌గఢ్ విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. రానున్న వర్షాకాలం గోదావరి నీటిని ఎత్తిపోయడనికి కాళేశ్వరం ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయడానికి విద్యుత్ అవసరం. దీని కోసం చతీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోలు అంశంలో వాదోపవాదాలు నెలకొన్నాయి. వీటిని పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాల విద్యుత్ అధికారులు పట్టువిడుపులు ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు. గత నెలలో దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలిచింది. అయితే అంత విద్యుత్‌ను సరఫరా చేయలేమని ఆధీకృత టెండర్ల దారులు చెప్పడంతో విద్యుత్ అధికారులు అవాక్ అవుతున్నారు. ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి మరో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డిస్కంలు నిర్ణయించాయి. ఇలా విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ డిస్కం యాజమాన్యాలు పరుగులు తీస్తున్నాయి.