తెలంగాణ

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రిజర్వేషన్లను ఖరారు చేసే అధికారాన్ని జిల్లాల్లో కలక్టర్లకు, రాష్ట్రంలో పంచాయతీరాజ్ కమిషనర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలలో 2,02,94,874 మంది జనాభా ఉండగా వీటిలో ఏజెన్సీ గ్రామాలు 1,308 ఉన్నాయి. వీరి జనాభా 18,68,968 ఉండగా వంద శాతం ఎస్‌టీలు ఉన్న 1,326 గ్రామాలలో 9,07,700 ఉన్నారు. మిగిలిన 10,107 మైదాన గ్రామ పంచాయతీలలో జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసారు. ఎస్‌సి, ఎస్‌టీలు కాకుండా ఇతర వర్గాలు కోటి 75 లక్షల 16 వేల 422 మంది జనాభా ఉండటంతో దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసారు. రాష్ట్రంలో ఎస్‌టీల జనాభా ప్రకారం మైదాన ప్రాంత పంచాయతీలలో 5.73 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. అలాగే ఎస్‌సి జనాభా 35,84,772 మంది ఉండగా వారికి 20.46 శాతం రిజర్వు చేసారు. బిసీ జనాభా ప్రకారం 34 శాతం రిజర్వేషన్లను ఖరారు చేసారు. మైదాన ప్రాంత గ్రామ పంచాయతీలలో ఎస్‌టీలకు 580, ఎస్‌సీలకు 2070, బిసీలకు 3,440 గ్రామాలను రిజర్వు చేసారు. జనరల్ కేటగిరికి 4027 గ్రామాలను కేటాయించారు. అన్ని రిజర్వేషన్లలో 50 శాతం మహిళకు కేటాయించనున్నారు. రిజర్వేషన్ల ఖరారు అయిన గ్రామ పంచాయతీల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్రం ప్రభుత్వం త్వరలో అందజేయనుంది.