తెలంగాణ

మేధావుల నిలయం శాసన మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: అన్ని రంగాల మేధావుల నిలయం శాసన మండలి అని శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. సోమవారం ఒరిస్సా రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి నృసింహ చరణ్ సాహు ఆధ్వర్యంలో వచ్చిన ఎమ్మెల్యేల బృందానికి మండలి ప్రాధాన్యతలను ఆయన వివరించారు. ఉపాధ్యాయ, పట్ట్భద్రులు, రాజకీయ, సామాజిక మేధాసంపత్తి తదితర రంగాల సమస్యలు, అనుభవాలు, భవిష్యత్ అవసరాల గురించి అర్థవంతంగా చేర్చించేందుకు మండలి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. మండలి సభ్యుల కాలపరిమితి ఆరు సంవత్సరాలని వారికి వివరించారు. ప్రస్తుతం దేశంలో ఏడు రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు ఉన్నాయని, ఎంతో అనుభవం గడిచిన సభ్యులు దీనికి రావడంతో ఎలాంటి ఆగ్రహావేశాలతో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని చర్చించే అవకాశం ఇందులో ఉంటుందని అన్నారు. తద్వారా ఉదాత్తమైన చట్టాలు రూపొందించుకొని పరిపాలన సాగించవచ్చునని వారికి వివరించారు. ఒరిస్సాలో శాసన మండలి ఏర్పాటుకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. స్వామిగౌడ్‌తో పాటు అసెంబ్లీ సెక్రెటరీ నరసింహాచార్యులు మండలి నియమ నిబంధనల గురించి ఆ రాష్ట్ర ప్రతినిధి బృందానికి వివరించారు.