తెలంగాణ

ధైర్యముంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని టి.పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై, సిఎల్‌పి నేత కె. జానారెడ్డిపై గూడూరు నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. గుత్తా అన్ని రాజకీయ పార్టీలనూ తిరుగుతూ టిఆర్‌ఎస్ ‘కారు’ ఎక్కారని ఆయన విమర్శించారు. తమ పార్టీ నాయకులైన ఉత్తమ్, జానారెడ్డిలపై విమర్శలు చేసే స్థాయి గుత్తాకు లేదన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏనాడూ పార్టీ ఫిరాయించలేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు చంచాగిరి చేసేందుకే గుత్తా విమర్శలు చేశారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించి, ఆ పదవికి రాజీనామా చేయకుండానే మాట్లాడుతున్నారని అన్నారు. విమర్శలు చేయాలనుకుంటే తొలుత కాంగ్రెస్ తరపున ఎన్నికైన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని గూడూరు డిమాండ్ చేశారు.
26వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎప్పుడు?
* ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రావుల
హైదరాబాద్, జూలై 17: టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలోని ప్రజల జీవన విధానం అస్థవ్యస్తమైందని, కీలక రంగాలైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు పడకేశాయని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 29,971 పాఠశాలలు ఉండగా, 26 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వీటిని భర్తీ చేయకుండా గత నాలుగేళ్ళుగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం రాష్ట్రంలో 8 నుంచి 10 లక్షల వరకు 10వ తరగతిలోపు విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళడం మాని వేశారని ఆయన తెలిపారు.