తెలంగాణ

సమన్వయంతో అడవులను సంరక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదాబాద్, జూలై 17: నానాటికి అంతరించి పోతున్న అడవులను పరిరక్షించుకునేందుకు సమన్వయంతో ముందుకు సాగుదామని డీజీపీ మహేందర్ రెడ్డి అటవీ, పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం అటవీ భూములు, వన్యప్రాణుల రక్షణ, వేట నియంత్రణపై పోలీస్, అటవీ శాఖల మధ్య సమన్వయ సమావేశం జరిగింది. వివిధ కమిషనరేట్లు పరిధిలోని పోలీస్ కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, డిఎఫ్‌లతో జరిగి వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్ రెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటవీ భూముల ఆక్రమణ, కలప కొట్టివేత, అక్రమ రవాణా వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ కార్యక్రమాల నిరోదంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రెండు శాఖల మధ్య సమన్వయంపై పలు కీలక నిర్ణయాలు జరిగాయి. విభిన్న జాతులకు చెందిన చెట్లు, వన్యప్రాణులు నివసించే అటవీ భూమిని కాపాడటం, తద్వారా పర్యావరణ రక్షణ ప్రతి పౌరుడి ప్రధమ విధి అని డిజీపీ అన్నారు. వరంగల్, అసిఫాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కొనే్నళ్లుగా అటవీ ప్రాంతం ఏ విధంగా ఆక్రమణకు గురైందన్న విషయాన్ని సమావేశంలో అటవీ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అటవీ భూముల ఆక్రమణ చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఈ సందర్భంగా డీజీపీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలోని అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా అడ్డుకోవాలని ఆదేశించారు. పోలీస్‌శాఖ తరుపున అటవా శాఖకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆక్రమణ దారులు, వేటగాళ్లపై పీడీ యాక్ట్ పెట్టి కేసులు పెడతామన్నారు. అడవి ప్రాధాన్యత అది చేసే మేలుపై సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాల వారీగా అటవీ, రెవెన్యూ, పోలీస్‌శాఖలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఆక్రమణలు, వేట, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మొపుతామని డీజీపీ పేర్కొన్నారు. ఆక్రమణకు గురి అయిన అనంతరం గుర్తించి ఇబ్బంది పడటం కంటే ముందే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్టవ్య్రాప్తంగా అటవీ భూముల వివరాలను మూడు శాఖల వద్ద ఉండేలా చూసి ఒక్క అడుగు భూమి కూడా ఇతరుల హస్తగతం కాకుండా చర్యలు తీసుకుందామన్నారు. పోలీస్ ఇంటిలిజెన్స్ వ్యవస్థను అటవీ అక్రమణలు, స్మగ్లింగ్ కార్యకలాపాలు గుర్తించేందుకు ఉపయోగిస్తామని చెప్పారు. వేట, స్మగ్లింగ్ సమయంలో కూలీలపై కేసులు వేసి వదిలివేయకుండా వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడం ద్వారానే పూర్తిస్థాయిలో నిరోదించవచ్చునన్నారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీ ఎఫ్‌లు పీకే.ఝా, రఘువీర్‌లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విస్తృత అవగాహన....
అడవుల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని డీజీపీ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణల తీరును గూగూల్ మ్యాప్‌ల సహాయంతో తెలయజేయాలని ఇందులో నిర్ణయించారు. నానాటికి అంతరించి పోతున్న అడవులే వాతావరణ మార్పులకు కారణమని తెలియజేసి ప్రజల్లో మార్పు తీసుకురవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రత్యేక బృందాలతో గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం చేపట్టాలని కోరారు.
హరితహారంలో భాగస్వాములం అవుతాం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న నాల్గొవ విడత హరితహారంలో పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అవుతోందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. భావి తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అద్బుత పథకం హరితహారం అని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాల్లో లాగానే తమ అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొంటారని చెప్పారు. హరితహారంలో భాగంగా పోలీస్‌స్టేషన్లు, పోలీస్‌శాఖకు సంబంధించిన స్థలాల్లో లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సిబ్బందికి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.