తెలంగాణ

పంటల అభివృద్ధికి రోడ్ మ్యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పసుపు, మిర్చి పంటల సమగ్రాభివృద్ధికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మెనేజ్‌మెంట్, మార్కెట్ లింకేజ్, బయ్యర్ సెల్లర్స్ మీట్, ధరల స్థీరీకరణ బాయిలర్స్, పాలీషర్స్ సరఫరా, విత్తనాల అందుబాటు తదితర అంశాలను రోడ్ మ్యాప్ తయారిలో పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సూచించారు. హార్టికల్చర్ యూనివర్సిటీ రైతులకు మేలు కలిగించేందుకు పరిశోధనలు, సలహాలు అందించాలని సూచించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి, పసుపు బోర్డు డిప్యూటీ డైరెక్టర్ లింగప్ప తదితరులతో సిఎస్ జోషి అధ్యక్షతన సమావేశం జరిగింది. రాష్ట్రంలో 70 వేల మంది రైతులు లక్షా 10 వేల హెక్టార్లలో పసుపు, లక్షా 40 వేల ఎకరాలలో మిర్చి పండిస్తున్నారని సిఎస్ వివరించారు. ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో పుసపు, మిర్చి పంటలు సాగు చేస్తున్నరన్నారు. పసుపు, మిర్చి రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. పసుపు, మిర్చి పండించే రైతులకు భూసార కార్డులను అందజేయాలన్నారు.
సకాలంలో ఎరువులు, క్రిమిసంహరక మందులు వాడే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వంద శాతం డ్రిప్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. పంటలను చీడ పురుగుల బారి నుంచి రక్షించడానికి రైతులకు వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలన్నారు. మిర్చి, పసుపు పంటల ఉత్పత్తికి వాల్యు ఎడిషన్ జరిగేలా చూడాలన్నారు. పసుపు అభివృద్ధి బోర్డు, ఉద్యానవన శాఖలు సంయుక్తంగా ఎగుమతిదారులు సమన్వయంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రైతులకు ఆధునాతన పద్ధతులు అందుబాటులోకి తెచ్చి ఉత్పాదకత పెరిగేలా చర్యలు చేపట్టాలని సిఎస్ జోషి సూచించారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్రంలో పసుపు, మిర్చితో పాటు అల్లం, వెల్లులి తదితర 8 రకాల దినుసులను పండిస్తున్నారు.
పసుపు పంట ఎక్కువగా పండించే నిజామాబాద్ జిల్లా పడగల్‌లో రూ.30 కోట్లతో స్పైస్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పసుపు, మిర్చి పంటల సేద్యానికి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.